ఆకర్షణీయ ఫీచర్లతో మార్కెట్లోకి టాటా‘హెక్సా’


దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2019లో హెక్సా ఎస్ యూవీ వర్షన్ కారును ఆవిష్కరించింది. అద్భుతమైన డిజైన్లు, సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్. దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలుగా నిర్ణయించారు. 

Tata Motors launch 2019 edition Hexa SUV at Rs 12.99 lakh

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ తమ ఎస్‌యూవీ  ‘హెక్సా’ 2019 వెర్షన్‌ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.99- 18.36 లక్షలుగా నిర్ణయించారు. ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతోపాటు ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్‌ వ్యవస్థ సహా పలు అదనపు ఫీచర్లను ఈ మోడల్ కారులో అదనంగా జత కలిపింది.

‘అధునాతన ఎస్‌యూవీ హెక్సా మోడల్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఎస్‌యూవీ విభాగంలో గణనీయమైన మార్పును తెచ్చింది’ అని టాటా మోటార్స్‌ అమ్మకాలు, మార్కెటింగ్‌ విభాగం ఉపాధ్యక్షుడు ఎస్‌ఎన్‌ బర్మన్‌ పేర్కొన్నారు. వినియోగదారులు కోరుకునేలా హెక్సా కొత్త మోడల్‌ ఉంటుందని, కొత్త డిజైన్‌, టెక్నాలజీ నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.

 టాటా హెక్సా డిజైన్ పై అంతా మక్కువ పెంచుకోవడంతో డ్యుయల్ టోన్ రూప్ ఆప్షన్లతో దీని 2019 వెర్షన్ డెవలప్ చేశారు. ఆటోమేటిక్ వేరియంట్ కార్లకు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మాన్యువల్ ట్రిమ్స్ కార్లకు చార్ కోల్ గ్రే అల్లాయ్ వీల్స్ అమర్చారు. 

టాటా హెక్సా తాజా మోడల్ కారు ఐదు రంగుల ఆప్షన్లలో వినియోగదారులకు లభించనున్నది. డ్యుయల్ టోన్ రూఫ్‌పై టాప్ ఎండ్‌లో రెండు కలర్స్ ‘ఇనిఫినిటీ బ్లాక్, టైటానియం గ్రే’ రంగుల్లో అందుబాటులోకి రానున్నది. అంతేకాదు 2.2 లీటర్ల వారికోర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లో మార్కెట్లో అడుగు పెడుతున్నది. ఇంజిన్ మూడు గేర్ బాక్సుల కాంబినేషన్‌తో లభించనున్నది. 

వారికోర్ 320 మోడల్ కారు 148 పీఎస్ పవర్, 320 ఎన్ఎం పీక్ టార్చ్ సామర్థ్యంతోనూ, వారికోర్ 400 వేరియంట్ కారు 154 పీఎస్ పవర్, 400 ఎన్ఎం మాగ్జిమమ్ టార్చ్ సామర్థ్యంలో లభించనున్నది. బేస్ ఎక్స్ఈ మోడల్ ఐదు స్పీడ్ మాన్యువల్, హైయ్యర్ వేరియంట్ కార్లు 6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వసతులతో మార్కెట్లోకి దూసుకొస్తున్నది. 2017 జనవరిలో టాటా మోటార్స్‌ హెక్సాను తొలిసారిగా విడుదల చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios