ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలలో టాటా మోటార్స్ జోరు.. మహీంద్రను అదిగమించి 3వ స్థానంలోకి..

టాటా మోటార్స్ ఆగస్టు 2020 అమ్మకాల గణాంకాలను విడుదల చేయడంతో ఈ మార్పు వచ్చింది. మొదటి స్థానంలో మారుతి, రెండవ స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ తరువాత టాటా మోటార్స్ ఉన్నాయి. 

tata motors beat mahindra & mahindra motors in 2020 august passenger vehicles sales

దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలలో మారుతి, హ్యుందాయ్‌ల తరువాత మూడవ స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ ఆగస్టు 2020 అమ్మకాల గణాంకాలను విడుదల చేయడంతో ఈ మార్పు వచ్చింది.

మొదటి స్థానంలో మారుతి, రెండవ స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ తరువాత టాటా మోటార్స్ ఉన్నాయి. మహీంద్రా వెహికిల్స్ కంటే టాటా మోటార్స్ 4,900 యూనిట్ల అధికంతో మూడవ స్థానంలో నిలిచింది.

టాటా మోటార్స్ వరుసగా రెండవ నెల కూడా మహీంద్రాను అధిగమించి దేశంలో మూడవ అతిపెద్ద అమ్మకందారునిగా నిలిచింది. 

also read కారు ధర రూ.25 కోట్లు.. కానీ నెంబర్‌ ప్లేట్ ధర తెలిస్తే షాక్ అవుతారు.. ...

టాటా మోటార్స్ ఆగస్టులో 14,136 యూనిట్లను విక్రయించగ గత ఏడాది ఇదే కాలంలో 10,887 యూనిట్లను విక్రయించింది. జూలైలో కంపెనీ 12,753 వాహనాలను సేల్స్ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 9.5 శాతం మార్కెట్ వాటాతో ఆల్ట్రోస్, నెక్సాన్ మోడళ్ల ఆదరణ మూడో స్థానానికి చేరుకుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత మార్కెట్ వాటాల నష్టం తాత్కాలికమే అని మహీంద్రా చెప్పారు.

కోవిడ్ 19 కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, కొత్త ప్రొడక్ట్ లాంచ్‌పై ప్రభావం చూపిందని, త్వరలో మళ్ళీ సేల్స్ డిమాండ్ తిరిగి రావడం ఖాయం అని మహీంద్రా తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios