పండుగ సీజన్ లో కార్ల తయారీ సంస్థలు డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడాని స్పెషల్ ఎడిషన్, ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా టాటా మోటార్స్ హారియర్ ఎస్‌యూవీ  కొత్త కామో ఎడిషన్‌ను విడుదల చేసింది.

ఎక్స్‌టి వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్,  ఎక్స్‌జెడ్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. కొత్త టాటా హారియర్ కామో ఎడిషన్ స్టాండర్డ్  హారియర్ కు కస్టమైజేడ్ వెర్షన్. దీని బయటి, లోపలి భాగంలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో అందిస్తున్నారు, అయితే ఇది బి‌ఎస్6 టాటా హారియర్‌తో సమానంగా ఉంటుంది.

  17-అంగుళాల బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్, కామో బ్యాడ్జ్‌లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ కామో గ్రీన్ బాడీ కలర్‌లో వస్తుంది. లోపలి భాగంలో బ్లాక్‌స్టోన్ (బ్లాక్ కలర్) మ్యాట్రిక్స్ డాష్‌బోర్డ్, బ్లాక్‌స్టోన్ లేదర్ సీట్లు, కామో గ్రీన్ కాంట్రాస్ట్ స్టిచింగ్, ఇంటీరియర్‌లో గన్‌మెటల్ గ్రే ఇన్సర్ట్‌లతో పొందుతుంది.

also read స్మార్ట్‌ఎక్స్ టెక్నాలజీ, న్యూలుక్ లో టీవీఎస్ కొత్త అపాచీ ఆర్టీఆర్ ...

 టాటా మోటార్స్ హ్యారీర్ కామో కోసం కామో స్టీల్త్, కామో స్టీల్త్ + లో  అనే రెండు ప్యాక్ గల  కస్టమైజేడ్ అసెసోరిస్ కూడా అందిస్తోంది. ఈ అసెసోరిస్ ఫిట్టింగుల ధరలు రూ.26,999 నుండి ప్రారంభమవుతాయి.

ఈ కస్టమైజేడ్ అసెసోరిస్ ప్యాకేజీలో ప్రత్యేకమైన కామో గ్రాఫిక్స్, సైడ్ స్టెప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు అలాగే ఇంటీరియర్ యాక్సెసరీస్ లో బ్యాక్ సీట్ ఆర్గనైజర్, ఒమేగార్క్ స్కఫ్ ప్లేట్లు, సన్ షేడ్స్, 3డి మోల్డ్ మాట్స్, 3డి ట్రంక్ మాట్స్, యాంటీ స్కిడ్ డాష్ మాట్స్ లభిస్తాయి.

టాటా హారియర్ కామో ఎడిషన్  2.0-లీటర్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌, 168 బిహెచ్‌పి- 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అందించారు.