మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ప్రజల కొత్త ఆవిష్కరణలు, వినూత్న విధానాన్ని ఇష్టపడతారు. తాజాగా  ఇన్స్టంట్ మెసేజెస్ పంపడానికి, స్వీకరించడానికి సిగ్నల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

 తాను చేసిన ట్వీట్ కి ప్రజలు వెంటనే రిట్వీట్ చేయడం  ప్రారంభించారు. కాగా కొందరు ఇది సోషల్ మీడియా యుగం, గోప్యతను మరచిపోండి. కొంతమంది అయితే ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించగా, మరికొందరు తానకి మద్దతు పలికారు.

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానం ఫిబ్రవరి నుండి అమలులోకి రానుంది. ఈ తరుణంలో సిగ్నల్ యాప్ వెలుగులోకి వచ్చింది.  

ఫేస్ బుక్ యాజమాన్యంలోని సోషల్ మీడియా యాప్ వాట్సాప్  కొత్త  ప్రైవసీ పాలసీ విధానం ప్రకటించిన తరువాత సిగ్నల్ యాప్ డౌన్ లోడ్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీనిబట్టి  ప్రజలు సిగ్నల్ యాప్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది.

సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్‌లు నిరంతరం పెరుగుతున్నాయి అని కొన్ని నివేదికలు తెలిపాయి. ఒక్క భారతదేశంలోనే గత ఒక వారంలో సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్‌లో 36% పెరుగుదల నమోదైంది. 

వాట్సాప్‌కు సిగ్నల్ యాప్ అతిపెద్ద ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. సిగ్నల్ యాప్ గురించి ఎక్కువగా దాని గోప్యత, భద్రతపై చర్చిస్తున్నారు  కాబట్టి సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ముందు దాని గోప్యతా విధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మంచిది.

ఆపిల్ యాప్ స్టోర్ లో సిగ్నల్ యాప్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ యాప్ మొబైల్ నంబర్ కాకుండా వినియోగదారుల నుండి మొబైల్ నంబర్ నుండి ఎటువంటి ఇతర సమాచారం తీసుకోదు. మీ గుర్తింపును బహిర్గతం చేయదని పేర్కొన్నారు. సిగ్నల్ యాప్ ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు అని తెలిపింది.