మారుతి సియాజ్, హ్యుండాయ్ వెర్నాలకు స్కోడా సవాల్
జర్మనీ కార్ల తయారీ దిగ్గజం స్కోడా మార్కెట్లోకి రాపిడ్ సరికొత్త వెర్షన్‌ను విపణిలోకి ఆవిష్కరించింది.కొత్త ఫీచర్లతోపాటు రాపిడ్ రైడర్ ఎడిషన్ కారు ధరను స్కోడా అందుబాటు ధరగా నిర్ణయించింది. దీనికి 1.6లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. క్యాండీ వైట్, కార్బన్ స్టీల్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.
జర్మనీ కార్ల తయారీ దిగ్గజం స్కోడా మార్కెట్లోకి రాపిడ్ సరికొత్త వెర్షన్‌ను విపణిలోకి ఆవిష్కరించింది. ఈ కారు రాపిడ్ స్టాండర్డ్‌వెర్షన్ కంటే రూ. లక్ష తక్కువ కావడం విశేషం. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.6.99లక్షలుగా కంపెనీ పేర్కొంది.
దీనిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, రేర్ పార్కింగ్ సెన్సర్లు, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, రేర్ విండ్ స్క్రీన్ డిఫాగర్ విత్ టైమర్, ముందు భాగంలో హైట్ అడ్జస్టబుల్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, రఫ్ రోడ్ ప్యాకేజీ, ఇంజిన్ ఇమ్మోబిలైజర్ విత్ ఫ్లోటింగ్ కోడ్ సిస్టం.
డాష్ బోర్డుపై డ్యుయల్ టోన్ ఫినిఫ్ ఎబోయ్యే శాండ్ (బ్లాక్), ఐవరీ స్లేట్ (వైట్) తదితర సరికొత్త ఫీచర్లు అమర్చారు. ఇంకా రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఏ ఫ్రంట్ అండ్ రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్, 2-డిన్ ఆడియో సిస్టమ్, యూఎస్ బీ ఏయూఎక్స్, బ్లూటూత్, ఫోర్ స్పీకర్స్, రేర్ ఏసీ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొత్త ఫీచర్లతోపాటు రాపిడ్ రైడర్ ఎడిషన్ కారు ధరను స్కోడా అందుబాటు ధరగా నిర్ణయించింది. దీనికి 1.6లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. క్యాండీ వైట్, కార్బన్ స్టీల్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.
స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డీజిల్ వర్షన్ కారుకు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అమర్చారు.
ఈ సెగ్మెంట్లో మారుతీ సియాజ్, హ్యుండాయ్‌వెర్నా, హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ వెంటోలకు స్కోడా రాపిడ్ రైడర్ బలమైన పోటీ ఇవ్వనుంది. దీని నేమ్‌ప్లేట్ తొలితరం ఆక్టేవియాను తలిపిస్తుంది.
స్కోడా సేల్స్, సర్వీస్ విభాగం డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ ‘స్కోడా మార్క్ డిజైన్, అద్భుతమైన ఇంటీరియర్, క్లాసిక్ సేఫ్టీ ఫీచర్లు , ఆకర్షణీయమైన ధర వంటి బెస్ట్ సెల్లింగ్ కారుకు అవసరమైన అన్ని హంగులు కల్పించాయి’ అని పేర్కొన్నారు.
మారుతి సుజుకి సియాజ్ రూ.8.19-9.98 లక్షలు, హ్యుండాయ్ వెర్నా రూ.8.09-11.70 లక్షలు, హోండా సిటీ రూ.9.81-12.86 లక్షలు, టయోటా యారిస్ రూ.9.29-12.85 లక్షలు, వోక్స్ వ్యాగన్ రూ.8.64-9.99 లక్షల మధ్య శ్రేణిలో ఉన్నాయి. స్కోడా రాపిడ్ రైడర్ కారు కంపాక్ట్ సెడాన్లు మారుతి సుజుకి డిజైర్ రూ.5.82-8.22 లక్షలు, హోండా అమేజ్ రూ.5.93-7.81 లక్షల మధ్య లభిస్తుంది.