Asianet News TeluguAsianet News Telugu

పాత వాహనాల యజమానులకు గుడ్ న్యూస్


ఈ నెల 15వ తేదీ నాటికి స్క్రాప్ వాహనాలపై ప్రభుత్వ విధి విధానాలేమిటో ప్రజలకు తెలిపి.. వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముసాయిదాను బహిరంగం చేయనున్నది కేంద్రం. 

Scrappage policy to be out for Public comments by November 15
Author
Hyderabad, First Published Nov 3, 2019, 11:11 AM IST

న్యూఢిల్లీ: కొత్త వాహనాల విక్రయాన్ని ప్రోత్సహించేందుకు గాను.. పాత వాహనాల స్క్రాపేజీ విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ద్రుఢ నిశ్చయంతో ఉంది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరేందుకు రెండు వారాల్లో కేంద్రం స్క్రాపేజీ పాలసీని బహిరంగంగా ప్రకటించనున్నదని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.

తమ్ముడి కళ్లు మెరిసేలా.. బాలీవుడ్ ఊర్వశి ‘భాయ్ దూజ్’ గిఫ్ట్

పాత వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి విధి విధానాలను రూపొందించి రవాణా మంత్రిత్వశాఖ పంపించిన తర్వాత ప్రజాభిప్రాయాలను కోరనున్నది. ఇంతకుముందు ఆగస్టు 23వ తేదీన త్వరలోనే పాత వాహనాల స్క్రాపేజీ విధానాన్ని అమలులోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. తద్వారా నూతన వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. రెందు దశాబ్దాల కాలంలో ఆటోమొబైల్ విక్రయాలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. 

మారుతి & టాటా ధగధగ.. మిగతా సంస్థలు దిగదిగ

ఈ క్రమంలో స్క్రాపేజీ విధానాన్ని వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు ఉచితంగా జరిగిన పాత తరం వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పలు రెట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం ముసాయిదా నివేదికను విడుదల చేసింది. కార్లలో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఫీజు రూ.600 నుంచి రూ.15 వేలకు పెంచాలని ప్రతిపాదించింది కేంద్రం.  ఇప్పటివరకు అసంఘటిత రంగంలో ఉన్న పాత వాహనాల విక్రయాలను ఫార్మాలైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు గత నెల 15వ తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. పాత వాహనాల విక్రయానికి ప్రాధాన్యాలు ఖరారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios