రెనాల్ట్ సరికొత్త క్విడ్.. ధరెంతంటే? బట్ గేం చేంజర్ పక్కా..

రెనాల్ట్ ఇండియా దేశీయ విపణిలోకి సరికొత్త క్విడ్ ఆర్ఎక్స్ఎల్ ప్రవేశించింది. ఇది మార్కెట్లో గేమ్ చేంజర్‌గా మారుతుందని రెనాల్ట్ సీఈఓ, ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ పేర్కొన్నారు. 

renault kwid rxl hatch back launched in india

ముంబై: ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ క్విడ్‌లో సరికొత్త ఆర్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ మోడల్ కారును రెనాల్ట్ విడుదల చేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ గల కొత్త వేరియంట్‌ను ఎంటీ, ఏఎంటీ వెర్షన్లలో తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ కారు ధరలు వరుసగా రూ.4.16 లక్షలు, రూ.4.48 లక్షలుగా ఉన్నాయి. 

కాగా భారత మార్కెట్లో క్విడ్‌కు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని, ఇప్పటికే విక్రయాలు 3.5 లక్షల యూనిట్లు అధిగమించాయని  రెనో ఇండియా సీఈఓ, ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ వెల్లడించారు. ఈ మోడల్ కారు గేమ్ చేంజర్‌గా నిలుస్తుందన్నారు. సరికొత్త క్విడ్‌ కోసం ఈ ఆధారిత ‘బై నౌ పే లాటర్‌’ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు రెనాల్ట్ తెలిపింది.

కంపెనీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ లేదా కంపెనీ డీలర్‌షిప్‌ వద్ద ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుందని రెనాల్ట్ ఇండియా పేర్కొంది. క్యాష్‌ ఆఫర్స్‌, ఎక్స్ఛేంజ్‌ బెనిఫిట్స్‌తో పాటు 8.25 శాతం వడ్డీతో కారు కొనుగోలుకు ఫైనాన్స్‌ సదుపాయాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. భారతదేశంలో ఎంట్రీ లెవెల్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. 

0.8 లీటర్లు, 1.0 లీటర్ పవర్ ట్రైన్స్ వేరియంట్లలో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ మోడల్ కారు వినియోగదారులకు లభిస్తుంది. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ మీడియా ఎన్ఏవీ ఎవల్యూషన్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఎల్ఈడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోర్ కన్సోల్ మౌంటెడ్ ఏఎంటీ డయల్, వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  

also read ఉబెర్ కార్యలయం మూసివేత.. ఖర్చులు తగ్గించుకోవడానికే... ...

ఈ మోడల్ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఏబీఎస్ విత్ ఈబీడీ), డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. 

క్విడ్ ఆర్ఎక్స్ఎల్ మోడల్ కారు ఆరు రంగుల్లో లభిస్తుంది. జాంక్సర్ బ్లూ, ఫెర్రీ రెడ్, మూన్ లైట్ సిల్వర్, ఐస్ కూల్ వైట్, ఔట్ బ్రేక్ బ్రౌంజ్, ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉందని రెనాల్ట్ పేర్కొంది. 

ఈ కారు కొనుగోలుదారులకు ఐదేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది రెనాల్ట్. ఇంక 0.8 స్టాండర్డ్ మోడల్ ధర రూ.2.94 లక్షలు, క్లైంబర్ ఎఏంటీ (ఓ) 1.0 లీటర్ల వేరియంట్ కారు ధర రూ.5.07 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios