అద్భుత ఫీచర్లతో రెనో డస్టర్ అప్డేట్.. విపణిలోకి రేపే!!

ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ డస్టర్ మార్కెట్లోకి 2019 అప్డేట్ మోడల్ కారు ఫేస్ లిఫ్ట్ సోమవారం విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

Renault Duster Facelift Prices Leaked Ahead Of July 8 Launch!

ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన ప్రజాదరణ పొందిన డస్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఎస్‌యూవీ మోడల్ డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ను సోమవారం విపణిలోకి రానున్నది. ‘న్యూ రెనాల్ట్‌  డస్టర్‌ సోమవారం మార్కెట్లోకి వస్తోందని రెనాల్ట్‌ ట్వీట్‌  చేసింది. 

ఆర్‌ ఎక్స్‌ఈ, ఆర్‌ఎక్స్‌ఎస్‌, ఆర్‌ఎక్స్‌ జెడ్‌ మూడు వేరియంట్లలో వస్తున్న డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ధరలను రూ. 8 లక్షలనుంచి రూ.13.10 లక్షలుగా నిర్ణయించింది. ఆర్‌ఎక్స్‌ఎస్‌ మోడల్‌ ఆల్‌వీల్‌ డ్రైవ్ ‌(ఏడబ్ల్యుడీ) ఆప్షన్‌ను అందిస్తోంది. బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా 1.5 పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్లలో తీసుకొస్తోంది.

పెట్రోల్‌ , డీజిల్‌ ఇంజీన్‌ 108 బీహెచ్‌పీ పవర్‌ను, పెట్రోలు వెర్షన్‌ లీటరుకు 14 కి.మీలు, డీజిల్‌ వెర్షన్‌ లీటరు 19-20 కి.మీ మైలేజీనీ ఇస్తుంది. కొత్త వెర్షన్‌ డస్టర్‌ కారు హ్యుండాయ్‌ క్రెటా, ఫోర్డ్‌ ఎక్సో స్పోర్ట్‌, మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

నూతన డస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీ డిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్లే విత్ క్రోమ్ సరౌండింగ్స్, న్యూ రూఫ్ రెయిల్స్, రీవర్క్డ్ ఫ్రంట్ బంపర్స్, టెయిల్ గేట్‌పై బ్లాక్ ప్యాడింగ్, న్యూ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

రెనాల్డ్ క్విడ్ (2019) మాదిరిగా ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆపిల్ కార్ ప్లే విత్ అప్ డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లతోపాటు న్యూ సీట్ ఫ్యాబ్రిక్స్ లభిస్తాయి. అన్ని వేరియంట్ల కార్లపై డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ వార్నింగ్ హెచ్చరికలు ఉంటాయి.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios