Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్లలో 1.50 లక్షల కార్ల సేల్స్.. ఇదీ రెనాల్ట్ టార్గెట్

ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత దేశ మార్కెట్లో తన వంతు వాటా పెంచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. మూడేళ్లలో 1.50 లక్షల యూనిట్లు విక్రయించడమే తమ లక్ష్యమని రెనాల్ట్ ఇండియా ఎండీ కం సీఈఓ వెంకట్రాం మామిళ్లపల్లి తెలిపారు. 

Renault aggressive plans to double sales volumes in 2 to 3 yrs
Author
New Delhi, First Published Mar 18, 2019, 10:47 AM IST

మూడేళ్లలో రెట్టింపు కార్లను విక్రయించడానికి ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’ దూకుడుగా ప్రణాళికలు రూపొందించింది. నూతన మోడల్ కార్లతోపాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడల్ కార్లను అప్ డేట్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని రెనాల్ట్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రాం మామిళ్లపల్లి పేర్కొన్నారు. 

కంపెనీ ముందు మధ్యంతర ప్రణాళిక కూడా ఉన్నదని రెనాల్ట్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రాం మామిళ్లపల్లి చెప్పారు. ప్రస్తుతం 80 వేల కార్లను విక్రయిస్తున్నామని, మూడేళ్లలో 1.50 లక్షల యూనిట్లకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. 

‘మేం 2019, 2020ల్లో నూతన మోడల్ కార్లను మార్కెట్లో ఆవిష్కరిస్తాం. వచ్చే జూలైలో ఒక మోడల్ కారును ఆవిష్కరిస్తాం. హ్యాచ్ బ్యాక్ మోడల్ క్విడ్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్ వంటి మూడేళ్లను అప్ డేట్ చేస్తాం’ అని తెలిపారు. 

రెనాల్ట్ ఇండియా టీం మొత్తం ఒక జట్టుగా పని చేయడం, టీం మొత్తం ఒకే యాంబిషన్‌తో పని చేయడం తమ వ్యూహాల్లో భాగమని రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ వెంకట్రాం మామిళ్లపల్లి చెప్పారు. లాభాలొచ్చే రీతిలో వినియోగదారులకు కార్లను విక్రయించడం ముఖ్యం అని అన్నారు. 

ప్రతి ఒక్కరూ వాస్తవిక ద్రుక్పథంతో పని చేస్తేనే యాంబిషన్ నిజం అవుతుందని రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ వెంకట్రాం మామిళ్లపల్లి తెలిపారు. వినియోగదారుడి ప్రయోజనాలను కాపాడటం రెండో ఆబ్జెక్టివ్ అని తెలిపారు. 

నాణ్యతతో కూడిన ఉత్పత్తులను డెలివరీ చేయడంతోపాటు ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ సప్లయర్లు, డీలర్లతో లావాదేవీలపై ఫోకస్ చేయడం రెండో అంశంగా ఉంటుందని రెనాల్ట్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రాం మామిళ్లపల్లి తెలిపారు. మూడో ఆబ్జెక్టివ్ రెట్టింపు సేల్స్ చేయడమేనన్నారు. 

తమ లక్ష్య సాధనలో మార్కెట్లో ఐదు శాతం వాటా విక్రయాలు రెనాల్ట్ కార్లే ఉండాలన్నారు. అంటే 1.50 లక్షల కార్లు విక్రయ లక్ష్యాలను చేరుకుంటుందా? అంటే ప్రస్తుత సేల్స్ కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని, ఆ దిశగా సగం విజయవంతం అయ్యామని రెనాల్ట్ ఇండియా ఎండీ కం సీఈఓ వెంకట్రాం మామిళ్లపల్లి చెప్పారు. సప్లయర్లు, డీలర్లు, ఇంజినీరింగ్, ప్లాంట్ నిర్వాహకులు అంతా టీం వర్క్‌గా పని చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios