ఈ ఏడాది అక్టోబర్‌లో దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 14.19 శాతం పెరిగి 3,10,294 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో మొత్తం 2,71,737 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 16.88 శాతం పెరిగి 20,53,814 యూనిట్లకు చేరుకున్నాయి. 2019 అక్టోబర్‌లో మొత్తం 17,57,180 ద్విచక్ర వాహనాలను విక్రయించారు.

డేటా ప్రకారం, గత నెలలో మొత్తం 13,82,749 మోటార్ సైకిళ్ళు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 23.8 శాతం ఎక్కువ. అలాగే  స్కూటర్ అమ్మకాలు 1.79 శాతం పెరిగి 5,90,507 యూనిట్లకు చేరుకున్నాయి.

అయితే, త్రీ వీలర్ అమ్మకాలు 60.91 శాతం తగ్గి 26,187 యూనిట్లకు చేరుకున్నాయి. ఎస్‌ఐ‌ఏ‌ఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ, పండుగ సీజన్లో కొన్ని ప్రాంతాలలో మంచి డిమాండ్ ఉన్నందున సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్లో వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.

also read పండుగ సీజన్‌లో కేవలం రూ.4వేలకే జావా బైకు మీ సొంతం: ఆనంద్ మహీంద్రా ట్వీట్ ...

దీపావళిలో బలమైన డిమాండ్ కారణంగా వాహనాలను డీలర్లు అందించడంతో భారీ అమ్మకాల గణాంకాలు గత నెలలో మెరుగ్గా ఉన్నాయి. అంతకుముందు, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏ‌డి‌ఏ) అక్టోబర్ లో ప్రయాణీకుల వాహనాల రిటైల్ అమ్మకాలు 8.8 శాతం తగ్గి 2,49,860 యూనిట్లకు చేరుకున్నట్లు నివేదించింది.


కంపెనీల అమ్మకాల వృద్ధి
కంపెనీ వేగంగా వాహనాలను విక్రయించింది
సంస్థ                         వాహనాల సంఖ్య     వాహనాలు అమ్మకాల శాతం 
మారుతి                        1,63,656                    17.64 శాతం
హ్యుందాయ్                    56,605                    13.9 శాతం
కియా మోటార్స్               20,621                      61.25 శాతం
హీరో మోటోకార్ప్             7,91,137                  34.78 శాతం
హోండా మోటార్ సైకిల్      4,94,459                  1.36 శాతం
టీవీఎస్ మోటార్ కంపెనీ    3,01,380                 19.27 శాతం


 ట్రాక్టర్ అమ్మకాలు 12 శాతం పెరిగాయి.
దేశీయ మార్కెట్లో ట్రాక్టర్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా  ఉంటాయని  రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. అంతకుముందు అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని వృద్ధి రేటు 10–12 శాతంగా ఉంటుంది.

కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ, వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. అదనంగా, ఖరీఫ్ సాగు పెరగడం, భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ భాగాలలో మంచి రుతుపవనాల కారణంగా ట్రాక్టర్ల డిమాండ్ పెరుగుతుంది.

కేంద్రం కనీస మద్దతు ధరను పెంచడం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచుతుందని, ఇది ట్రాక్టర్ అమ్మకాలు వేగవంతం కావడానికి సహాయపడుతుందని క్రిసిల్ డైరెక్టర్ గౌతమ్ షాహి అన్నారు. 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ట్రాక్టర్ అమ్మకాలు సంవత్సరానికి 12 శాతం పెరిగాయి.