ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఆకాశంలోకి ఎగిరే కారు వచ్చేస్తోంది..

ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య పర్సనల్ ఎయిర్ ల్యాండ్ వెహికిల్(పాల్-వి) అభివృద్ధిలో పాల్గొన్న డచ్ కంపెనీ ఫ్లయింగ్ కార్లు త్వరలో భారతదేశంలోకి రానుంది. ఇందుకోసం త్వరలో దేశంలో వాహనాన్ని పరీక్షించడం ప్రారంభించాలని యోచిస్తోంది.

Pal V may start testing flying car in India soon

న్యూ ఢీల్లీ: సాధారణంగా కారులో ప్రయానించే వారికి ఎదురయ్యే మొదటి సమస్య ట్రాఫిక్. ప్రముఖ నగరాలలో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై కారు ప్రయాణం అంటే ఒకోసారి విసుగు చెందుతుంది. ఆఫీసుకు వెళ్లాలన్న, బయటికి వెయ్యాలన్న ట్రాఫిక్ తో ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు.

వీటి అన్నిటికి చెక్ పెట్టేందుకు ఒక కొత్త కారు రాబోతుంది. ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య పర్సనల్ ఎయిర్ ల్యాండ్ వెహికిల్(పాల్-వి) అభివృద్ధిలో పాల్గొన్న డచ్ కంపెనీ ఫ్లయింగ్ కార్లు త్వరలో భారతదేశంలోకి రానుంది. ఇందుకోసం త్వరలో దేశంలో వాహనాన్ని పరీక్షించడం ప్రారంభించాలని యోచిస్తోంది.

“మేము భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని మా టెక్నాలజీని ప్రదర్శించాము. మేము త్వరలో భారతదేశంలో పరీక్షలను ప్రారంభించవచ్చు ”అని పాల్-వి కో-చైర్మన్ జాన్పీటర్ కోనింగ్ అన్నారు.

2012లో వాహనం నమూనాను ప్రదర్శించిన పాల్-వి, వ్యక్తిగత కొనుగోలుదారుల కోసం వచ్చే ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిని వాణిజ్యపరంగా ప్రారంభించడానికి కృషి చేస్తోంది. ఈ వాహనం ప్రస్తుత అంతర్జాతీయ వాయు, భూ నియమాలకు అనుగుణంగా ఉంటుంది.

also read ఎం‌జి మోటర్స్ కొత్త బిజినెస్ ; ఇప్పుడు తక్కువ ధరకే కార్లను కొనోచ్చు.. ...

వాహనాన్ని ఎగురుతున్నందుకు ధృవీకరణ పొందటానికి కొనుగోలుదారులకు సంస్థ శిక్షణ ఇస్తుంది. శిక్షణ ప్రక్రియ 35-40 గంటలు పడుతుంది.ప్రజా రవాణా కోసం వాహనాన్ని ఉపయోగించడం ప్రస్తుతానికి సవాలుగా మిగిలిపోతుందని కోనింగ్ సమాచారం. దీనికి తగిన నిబంధనలు, మౌలిక సదుపాయాల కల్పన అవసరమని ఆయన అన్నారు.

అంతేకాకుండా, బ్యాటరీ చాలా భారీగా ఉంటుంది కాబట్టి ఇతర పరిష్కారాలను చూడవలసి ఉంటుంది. నెదర్లాండ్స్‌కు చెందిన పర్సనల్‌ ఎయిర్‌ల్యాండ్‌ వెహికల్‌ అనే సంస్థ ఎగిరే కార్ల మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ను గుజరాత్‌లో ప్రారంభించనుంది.

వచ్చే ఏడాది ఎగిరే కార్ల తయారీ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాల్‌-వి సంస్థకు 110 ఎగిరే కార్ల తయారీకి ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. త్వరలో వీటిని గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారు చేసి యూరోపియన్‌ దేశాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

ఈ ఎగిరే కార్లలో మొత్తం రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇద్దరు కూర్చోడానికి వీలుంటుంది. రోడ్డు మీద 160 కిలోమీటర్ల వేగంతో, గాలిలో 180 కిలోమీటర్ల వేగంతో ఈ కారులో ప్రయాణించవచ్చు. కేవలం మూడు నిమిషాల్లో ఇది సాధారణ కారు నుంచి ఎగిరే కారులా మారగలదు.

ఒక్కసారి దీని ట్యాంక్‌ను నింపితే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన స్కై డ్రైవ్‌ సంస్థ కూడా ఎగురుతున్న తమ కారుకు సంబంధించి వీడియోను తాజాగా విడుదల చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios