హ్యుండాయ్ మైలురాళ్లు: 42,681 వెన్యూ కార్లు సేల్స్.. 75 వేల బుకింగ్స్

11 నెలలుగా ఆటోమొబైల్ రంగం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాల కొనుగోళ్లు మందకోడిగా ఉన్నా.. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మాత్రం భారీగా విక్రయాలతో పండుగ చేసుకుంటోంది. ఎస్‌యూవీ మోడల్ కారు వెన్యూ మే-సెప్టెంబర్ మధ్య 42,681 కార్లు అమ్ముడయ్యాయి. 75 వేలకు పైగా కార్ల కోసం బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. బ్లూ లింక్ టెక్నాలజీతో వివిధ వేరియంట్లలో 50 శాతం బుకింగ్స్ నమోదయ్యాయి.

Over 42,000 Hyundai Venue SUVs Sold In 5 Months; Bags Over 75,000 Bookings

న్యూఢిల్లీ: 11 నెలలుగా ఆటోమొబైల్ రంగం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాల కొనుగోళ్లు మందకోడిగా ఉన్నా.. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మాత్రం భారీగా విక్రయాలతో పండుగ చేసుకుంటోంది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ సంస్థ ఎస్‌యూవీ మోడల్ కారు వెన్యూ కారు విక్రయాలు మే-సెప్టెంబర్ మధ్య 42,681 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

ఇప్పటి వరకు 75 వేలకు పైగా కార్ల బుకింగ్స్ నమోదయ్యాయి. 50 శాతం మంది బ్లూ లింక్ టెక్నాలజీతో వివిధ వేరియంట్లలో బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. వాటిలో ఎస్ఎక్స్ డీసీటీ, టాప్ ఎండ్ ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ మోడల్ కార్ల బుకింగ్స్ కోసం ప్రాధాన్యం ఇచ్చేవారు. 

హ్యుండాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ జే హ మాట్లాడుతూ ‘దేశీయంగా కార్ల విక్రయాల్లో వెన్యూ నంబర్ వన్ స్థానంలో ఉందని, మాకు గర్వ కారణం’ అని చెప్పారు. కేవలం ఐదు నెలల్లోపు 42,681 కార్లు అమ్ముడు పోవడంతోపాటు 75 వేలకు పైగా బుకింగ్స్ నమోదు కావడం రీ ఫ్రెష్డ్ డిజైన్, ఇన్నోవేటివ్ ఫీచర్లకు కార్ల వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతుందన్నారు. 

మే- సెప్టెంబర్ మధ్య వెన్యూతో గట్టిగా పోటీ పడుతున్న మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కార్లు 40,425 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో విటారా బ్రెజ్జాను దాటేసి మరీ వెన్యూ విక్రయాలు సాగాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కార్లు 19,370 ఎస్‌యూవీ కార్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచాయి. 

టాటా మోటార్స్ టాటా నెక్సాన్ 17,137, ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ మొత్తం సేల్స్ 16,016 కార్లు అమ్ముడయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే బ్లూ లింక్ టెక్నాలజీతో కూడిన తొలి కారు వెన్యూను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది హ్యుండాయ్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios