4.7 లక్షలకు పైగా హ్యుందాయ్ కార్లకు రీకాల్.. లోపం కారణంగా కార్లను బయట పార్క్ చేయాలని సూచన..
ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ సెప్టెంబర్ లో రీకాల్ చేసిన ఎస్‌యూవీలకు మరిన్ని కార్లను జోడించింది. ఈ తాజా రీకాల్ 2016 నుండి 2018 వరకు తయారైన టక్సన్ ఎస్‌యూవీలు అలాగే అదనంగా 2020 నుండి 2021 వరకు తయారైన వాటిపై ఈ రీకాల్ ప్రభావం చూపనుంది.
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఎబిఎస్ మాడ్యూల్ లోపం కారణంగా యు.ఎస్ లోని 4.7 లక్షల ఎస్‌యూవీ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ సెప్టెంబర్ లో రీకాల్ చేసిన ఎస్‌యూవీలకు మరిన్ని కార్లను జోడించింది.
ఈ తాజా రీకాల్ 2016 నుండి 2018 వరకు తయారైన టక్సన్ ఎస్‌యూవీలు అలాగే అదనంగా 2020 నుండి 2021 వరకు తయారైన వాటిపై ఈ రీకాల్ ప్రభావం చూపనుంది.
కార్లలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా తమ వాహనాలను బయట పార్క్ చేయాలని వాహన తయారీదారులు వినియోగదారులను కోరారు.
యాంటిలాక్ బ్రేక్ సిస్టమ్ కూడిన వాహనాలు అంతర్గతంగా పనిచేయకపోవచ్చని, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఫలితంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కార్ల తయారీ సంస్థ అభిప్రాయపడింది. అయితే హ్యుందాయ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న టక్సన్ ఎస్‌యూవీలకు ఈ రీకాల్ జారీ చేయలేదు.
also read కొత్త స్టయిల్, లుక్ తో టాటా సఫారిని నెక్స్ట్ జనరేషన్ మోడల్.. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల ...
ఈ రీకాల్ సమస్యకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులో ఒక భాగమని కార్ల తయారీదారులు చెప్పారు. అంతేకాకుండా, ఫిబ్రవరి చివరలోగా కారు యజమానులను సంప్రదిస్తారు. తరువాత వారు తమ వాహనాలను డీలర్ వద్దకు తీసుకెళ్ళాల్సి ఉంటుంది.
రీకాల్ సమస్యకు కంప్యూటర్‌లోని ఫ్యూజ్ ని వాహన తయారీ సంస్థలు ఉచితంగా భర్తీ చేస్తారు. కార్ యజమానులు వారి టక్సన్ కారు రీకాల్ కి ప్రభావితమైందో లేదో తెలుసుకోవడానికి www.hyundaiusa.com/recallsలో చూడవచ్చు. వారు తమ 17-అంకెల వాహన గుర్తింపు నంబరును ఎంటర్ చేయడం ద్వారా వెరిఫి చేయవచ్చు.
ఇదే సమస్యను పరిష్కరించడానికి హ్యుందాయ్ ఇంతకుముందు యు.ఎస్ మార్కెట్లో 1.8 లక్షలకు పైగా టక్సన్ ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. ప్రభావితమైన ఎస్‌యూవీలు 2019 నుండి 2021 వరకు తయారు చేయబడ్డాయి.
డీఫెక్టివ్ సర్క్యూట్ బోర్డ్‌లో పేరుకుపోయిన తుప్పు వల్ల ఇంజన్లు ఆపివేసినప్పటికీ, ముఖ్యంగా తేమ, వేడి కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడవచ్చని కార్ల తయారీ సంస్థ తెలిపింది.