ఆరంభంలోనే అదరగొట్టిన నిస్సాన్ మాగ్నైట్ బుకింగులు.. కేవలం 5 రోజుల్లోనే 5 వెలకి పైగా..

జపాన్ కార్ల తయారీ నిస్సాన్ కొత్తగా లాంచ్ చేసిన  నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 5వేల బుకింగ్స్, 50వేలకి పైగా  ఎంక్వైరీలను సాధించింది.

Nissan Magnite Bags Over 5000 Bookings Within Five Days Of Its Launch in india

జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభించినప్పటి నుండే కార్ల కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ కారు లాంచ్ చేసిన ఐదు రోజుల్లోనే 5వేలకు పైగా బుకింగ్‌లు పొందగా, 50,000కి పైగా ఎంక్వైరీలు అందుకుంది.

60 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లు మొదటి రెండు మోడల్స్  ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియంకి, 30 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లు సివిటి ఆటోమేటిక్ వేరియంట్ కోసం  వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిస్సాన్ మొత్తం బుకింగ్‌లలో 40 శాతానికి పైగా డిజిటల్ ఛానెళ్ల ద్వారా జరిగాయి.

నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ఆల్-న్యూ నిస్సాన్ మాగ్నైట్ భారత వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. పెరుగుతున్న ఫుట్‌ఫాల్స్, సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ గణనీయమైన బుకింగ్‌లు" మేక్ ఇన్ ఇండియా, " మేక్ ఫర్ ది వరల్డ్ "భారతీయ కస్టమర్ల కోసం ఈ ఎస్‌యూవీ గేమ్ చెంజింగ్  ఉత్పత్తి అవుతుంది.

also read దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ కార్లు ఇవే.. ...

టాప్ వేరియంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, వినియోగదారులు సురక్షితమైన, స్టైలిష్, ఫీచర్-రిచ్ ఇంకా బెస్ట్ ఇన్ కార్ డెలివరీ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారని స్పష్టమవుతోంది. " అని అన్నారు.

నిస్సాన్ మాగ్నైట్ ను డిసెంబర్ 2న భారతదేశంలో బేస్ వేరియంట్‌ను రూ.4.99 లక్షల పరిచయ ధరతో విడుదల చేసింది, ఆటోమేటిక్ వేరియంట్‌ ధర రూ.9.59 లక్షల వరకు ఉంటుంది, ఈ విభాగంలో అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచింది. ఈ ధరలు డిసెంబర్ 31, 2020 వరకు వర్తిస్తాయి అని నిస్సాన్ తెలిపింది.

నిస్సాన్ మాగ్నైట్ నాలుగు మోడల్స్ - XE, XL, XV ఇంకా XV ప్రీమియం రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. ఒకటి 1.0-లీటర్, రెండోది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజన్ 71 బిహెచ్‌పి, 96 ఎన్‌ఎమ్ టార్క్ ట్యూన్ చేయగా, టర్బో-పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి, 160 ఎన్‌ఎమ్ టార్క్ చేస్తుంది.

రెండిటికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది, అయితే, టర్బో పెట్రోల్ యూనిట్ ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్ యూనిట్‌తో వస్తుంది, ఇది 152 ఎన్ఎమ్ వద్ద కొంచెం తక్కువ టార్క్ అందిస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios