కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త మోడల్ ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 వచ్చే నెల నవంబర్ 5న నుండి భారతదేశంలో సేల్స్ ప్రారంభించనుంది. ఫీచర్స్ విషయానికి వస్తే హ్యుందాయ్ మోడల్స్ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటాయి.

అయితే హ్యుందాయ్ లేటెస్ట్ మోడల్ లో ఒక కొత్త ఫీచర్ జోడించింది. కొత్త హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు సన్‌రూఫ్‌తో వస్తుంది. హోండా జాజ్ కారులో ఇప్పటికే ఈ ఫీచర్ అందించారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రొడక్షన్ హెడ్ గణేష్ మణి మాట్లాడుతూ, ఈ కారు ముఖ్యమైన ఫీచర్ సన్‌రూఫ్, ఈ కారు సంస్థకి చాలా ప్రత్యేకమైనది. కొత్త ఐ20 మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, ఆస్టా (ఓ) వేరియంట్లలో ఈ ఫీచర్ అందిస్తున్నారు.

also read ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్‌ పొందే ఛాన్స్.. ...

సన్‌రూఫ్ రేంజ్ ప్రత్యేకమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్ ఫీచర్స్ లో  డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మౌంట్ కంట్రోల్స్‌తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ ఎసి వెంట్స్, ఛార్జింగ్ సాకెట్స్, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ ఉన్నాయి.

కొత్త ఐ20 క్యాబిన్ పూర్తిగా రీడిజైన్  చేసిన ఆల్-బ్లాక్‌లో వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా, కొత్త ఐ20లో మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి.

గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో పెట్రోల్ ఇంజిన్‌తో ఐవిటి (సివిటి) ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఏడు-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) లేదా 1.0-లీటర్-టర్బో ఇంజిన్‌తో ఆరు-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్, ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్  స్టాండర్డ్ గా అందిస్తున్నారు.