జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వేగన్ తాజాగా 'మై వోక్స్ వేగన్ కనెక్ట్' మొబైల్ యాప్ లాంచ్ చేసింది. కొత్త ఇంటరాక్టివ్ సిమ్-ఆధారిత యాప్ ఇండియాలో విక్రయించే వోక్స్ వేగన్ కార్లకు కనెక్ట్ కార్  టెక్నాలజీని తీసుకొచ్చింది. కార్ టెలిమాటిక్స్, జియోఫెన్సింగ్, రిమోట్ ట్రాకింగ్ వంటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ కి అక్సెస్ అందిస్తుంది.

ఈ యాప్ అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ కోసం అందుబాటులో ఉంది. కొత్త పోలో జిటి టిఎస్‌ఐ, వెంటో హైలైన్ ప్లస్ లో మై వోక్స్ వేగన్ కనెక్ట్ యాప్‌ను స్టాండర్డ్ గా పొందుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టిగువాన్ ఆల్స్పేస్ లేదా టి-రోక్ యాప్ సపోర్ట్ పొందుతుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. 

'మై వోక్స్ వేగన్ కనెక్ట్' మొబైల్ యాప్ గురించి వోక్స్ వేగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ మాట్లాడుతూ, "వోక్స్ వేగన్ ఇండియాలోని మా కస్టమర్లకు ఉత్తమమైన టెక్నాలజి, కనెక్టెడ్ సొల్యుషన్స్  అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము.

ఈ రోజు మై వోక్స్ వేగన్ కనెక్ట్ యాప్  కస్టమర్ సౌలభ్యం, భద్రతను వారి చేతికే అందిస్తుంది. కస్టమర్లు వారి కార్ స్టేటస్, డ్రైవింగ్ విధానాల గురించి తెలుసుకునేలా రియల్ టైమ్ కార్ సంబంధించిన వివరాలను చూపిస్తుంది. 

also read మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్‌ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్.. ...

కొత్త మై వోక్స్ వేగన్ కనెక్ట్ కార్ మొబైల్ యాప్ లో పూర్తి కార్ సమాచారాన్ని అందించడానికి కారు ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ (OBD) పోర్టులో ప్లగ్ చేసిన డాంగిల్‌ను ఉపయోగిస్తుంది.

ఈ యాప్  డ్రైవింగ్ స్టైల్ క్వాంటిఫైయింగ్ స్పీడ్, బ్రేకింగ్ సిస్టం, కూల్ఎంట్ టెంపరేచర్, ఆక్సీలరేషన్, ఆర్‌పిఎమ్‌ డేటాను అందిస్తుంది. ఈ యాప్ వినియోగదారులకు అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్ కేర్ లేదా రోడ్‌సైడ్ సహాయం కోసం  కూడా ఉపయోగపడుతుంది.

మై వోక్స్ వేగన్ కనెక్ట్ యాప్ లో కార్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. కార్ ఇన్సూరన్స్  రెనివల్ కోసం రిమైండర్‌లను సెట్ చేయడానికి మీరు ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. వోక్స్ వేగన్ ఇండియా మూడేళ్ల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్, వారంటీతో ఈ యాప్‌ను అందిస్తోంది.

హోండా కార్స్ ఇండియా  కూడా హోండా కార్స్ కోసం హోండా కనెక్ట్ యాప్‌ను అందిస్తుండగా, నిస్సాన్ కూడా నిస్సాన్ కనెక్ట్ యాప్‌ను నిస్సాన్ కార్ల కోసం అందిస్తుంది.