వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. 31 మార్చి 2021 వరకు సర్టిఫికెట్ల వాలిడిటీ పొడిగింపు..
కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వాహనాల డాక్యుమెంట్స్ వాలిడిటీ పొడిగింపుకు సంబంధించి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరి అడ్మినిస్ట్రేషన్స్ కి ఎంఓఆర్‌టిహెచ్ ఒక డైరెక్టరీని కూడా జారీ చేసింది.
వాహనల డాక్యుమెంట్స్ వాలిడిటీని 31 మార్చి 2021 వరకు పొడిగించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
వాహనాల డాక్యుమెంట్స్ వాలిడిటీ పొడిగింపుకు సంబంధించి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరి అడ్మినిస్ట్రేషన్స్ కి ఎంఓఆర్‌టిహెచ్ ఒక డైరెక్టరీని కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇతర వాహన పత్రాలు 31 మార్చి 2021 తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి.
కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఎంఓఆర్‌టిహెచ్ మోటారు వాహన పత్రాల పొడిగింపు చేయడం ఈ సంవత్సరంలో ఇది నాల్గవసారి. 1 ఫిబ్రవరి 2020తో గడువు ముగిసిన లేదా 31 మార్చి 2021కి ముందే ముగుస్తున్న అన్ని పత్రాలు వాలిడిటీ 31 మార్చి 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
also read హెల్మెట్ ధరించడం సమస్య ఉందా, అయితే ఇప్పుడు మడతపెట్టె హెల్మెట్ వచ్చేసింది.. ...
మోటారు వాహనాల చట్టం 1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు 1989 ప్రకారం సంబంధించిన పత్రాల వాలిడిటీ పొడిగింపుపై గతంలోనే మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది.
ఇటీవల విడుదల చేసిన ఎంఓఆర్‌టిహెచ్ సర్క్యులర్ లో "కోవిడ్-19 వ్యాప్తిని నివారించవలసిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని పత్రాల చెల్లుబాటు 31 మార్చి 2021 వరకు చెల్లుబాటు అయ్యేల పరిగణించనున్నట్లు సూచించింది. ఇది 1 ఫిబ్రవరి 2020తో గడువు ముగిసిన లేదా 31 మార్చి 2021తో ముగుస్తున్న అన్ని పత్రాలకు వర్తిస్తుంది." అని తెలిపింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా సాధారణ స్థాయికి రాలేదని దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 31 మార్చి 2021 వరకు వాహన పత్రాలను వాలిడిటీ పొడిగింపు అయ్యేలా చూడాలని ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సూచించింది.