MG Motors ZS-EV: ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా, MG Motors నుంచి ZS-EV మోడల్ విడుదల. ధర ఎంతంటే..?

MG మోటార్ ఇండియా ZS-EV (MG Motors ZS-EV) కొత్త వెర్షన్‌ను దేశంలో ప్రవేశపెట్టింది. MG Motors ZS-EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ మైలేజీ అందిస్తోంది. అంటే సుమారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఒకసారి వరకూ ఛార్జీ చేయడం ద్వారా వెళ్ళవచ్చు

MG Motors launches new ZS EV starting at Rs 21 lakh

పెట్రోల్, డీజెల్ ధరలను తలుచుకుంటేనే గుండె గుభేల్ అనే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో  దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలతో దేశీయ మార్కెట్లోకి దిగుతున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి దూసుకొస్తుండగా, MG Motor India కూడా కొత్త వాహనాలతో మార్కెట్లోకి వస్తోంది.  

తాజాగా MG మోటార్ ఇండియా ZS-EV (MG Motors ZS-EV) కొత్త వెర్షన్‌ను దేశంలో ప్రవేశపెట్టింది. MG Motors ZS-EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ మైలేజీ అందిస్తోంది. అంటే సుమారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఒకసారి వరకూ ఛార్జీ చేయడం ద్వారా వెళ్ళవచ్చు. ఇది 50.3 kWh అతిపెద్ద, సురక్షితమైన, అత్యంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ZS-EV షోరూమ్ ధర రూ. 21.99 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త ZS EV రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, దీని ధరలు వరుసగా రూ. 21.99 లక్షలు, రూ. 25.88 లక్షలుగా ఉన్నాయి. 

ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ కోసం బుకింగ్ ప్రారంభించామని, ఎక్సైట్ ట్రిమ్ బుకింగ్‌లు జూలై 2022 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ZS EVకి డిమాండ్ ప్రోత్సాహకరంగా ఉందని, కొత్త వేరియంట్ కస్టమర్లతో బ్రాండ్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని MG మోటార్ ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. UK, యూరప్ మరియు ఆస్ట్రేలియాతో సహా కీలక ప్రపంచ మార్కెట్లలో  ZS EV (MG Motors ZS-EV) విజయవంతమైందని ఆయన తెలిపారు.

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే ZS-EV (MG Motors ZS-EV) పూర్తిగా కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాటరీతో ఆధారితమైనది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డ్రైవ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, ESC, TPMS మరియు అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ZS-EV iSmart నుండి 75కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లను అందిస్తుంది. ZS-EVని 2 సంవత్సరాల పాటు నడపడం వల్ల 70 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు గాల్లో విడుదల కాకుండా ఆదా అవుతుంది. ఇది 42 వేల చెట్లను నాటడంతో సమానం.

ప్రీమియం లెదర్ డ్యాష్ బోర్డ్, సెంటర్ ఆర్మ్ రెస్ట్, డ్యూయల్-పేన్ పనోరమిక్ స్కై రూఫ్, రియర్ సెంటర్ హెడ్‌రెస్ట్, కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, వెనుక AC వెంట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ కారు  ఫెర్రిస్ వైట్, కరెంట్ రెడ్, అషెన్ సిల్వర్, సేబుల్ బ్లాక్. (Ferris White, Currant Red, Ashen Silver, Sable Black) 4 విభిన్న రంగులలో అందుబాటులో ఉంది.  

కొత్త ZS-EV ఎలక్ట్రిక్‌ (MG Motors ZS-EV) కారు అయినప్పటికీ, మార్కెట్లోని అగ్రశ్రేణి లగ్జరీ కారుతో పోటీపడే అవకాశాన్ని అందించే హైటెక్ ఫీచర్‌లతో వస్తుంది. డిజిటల్ క్లస్టర్‌లో 17.78 సెం.మీ (7 అంగుళాల) LCD స్క్రీన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1-అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌లతో 5 యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి. సరికొత్త ZS EVలో డిజిటల్ బ్లూటూత్ ఫీచర్ కూడా ఉండటం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios