నాలుగు వేరియంట్లలో త్వరలో విపణిలోకి ఎంజీ ‘హెక్టార్’

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ త్వరలో విపణిలోకి నాలుగు వేరియంట్లలో హెక్టార్ మోడల్ కారును ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే ఈ కార్ల కొనుగోలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

MG Hector Will Be Launched In Four Variants

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ త్వరలో మార్కెట్లోకి రానున్న హెక్టార్ మోడల్ కారు నాలుగు వేరియంట్లలో రానున్నది. ఇటీవలే ఈ సంస్థ భారతదేశంలో డీలర్ షిప్‌ను ప్రారంభించింది. హెక్టార్ కారు కోసం అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. 

‘స్టైల్’, ‘స్మార్ట్’, ‘సూపర్’, ‘షార్ప్’వేరియంట్లలో ఎంజీ మోటార్స్ హెక్టార్ కారు రోడ్లపైకి రానున్నది. తొలుత స్టయిల్ వేరియంట్‌లో మార్కెట్లోకి రానున్నది. బేస్ వేరియంట్ కారులో మాత్రం 10.4 అంగుళాల హెచ్ డీ టచ్ స్ర్కీన్ ఫీచర్ మిస్ కావాల్సిందే. విత్ ఆడియో సపోర్ట్ యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీతోపాటు 2 డిన్ ఆడియో సిస్టమ్ కూడా లభించదు. 

ఈ కారులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), రేర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ హోల్డ్ కంట్రోల్ (హెచ్హెచ్సీ), డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) వంటి సేఫ్టీ పరంగా డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్స్ అమర్చారు. 

ప్రమాణాల పరంగా హెక్టార్ ఏసీ వెంట్స్, 3.5 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే (ఎంఐడీ), ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రేర్ సీట్ రిక్లైన్, డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, పవర్డ్ ఓఆర్వీఎంఎస్, ఫ్రంట్ అండ్ రేర్ ఫాస్ట్ చార్జింగ్ విత్ 2ఏ యూఎస్బీ పోర్ట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ హైట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
 
ఎంజీ మోటార్స్ హెక్టర్ మోడల్ కారు రెండు ఇంజిన్ల ఆప్షన్లు, వన్ మైల్డ్ హైబ్రీడ్ వేరియంట్‌ల్లో లభిస్తుంది. ఫియట్ కారును పోలే 2.0 డీజిల్ మల్టీ ఇంజిన్, 168 బీహెచ్పీ, 350 ఎన్ఎం పీక్ టార్చ్ కలిగి ఉన్న హెక్టార్ కారు 6- మాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగి ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వసతి ఉండదు.

కానీ 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ యూనిట్ పెట్రోల్ వేరియంట్ మాత్రం స్మూత్‌గా షిఫ్ట్ అయి పోవచ్చు. 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 141 బీహెచ్పీ, 250 ఎన్ఎం పీక్ టార్చ్ సామర్థ్యం ఈ కారు ఇంజిన్ సామర్థ్యం. 48 వోల్డుల మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్‌తో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 

48 వోల్ట్ సామర్థ్యం గల లీథియం ఐయాన్ బ్యాటరీతో అదనంగా 20 ఎన్ఎం ఇంధన శక్తి కలిగి ఉంది. ఈ రెండింటి కాంబినేషన్‌తోపాటు ఇంజిన్ ఆటో స్టార్ట్ స్టాప్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఈ -బూస్ట్ వంటి మూడు కీలక ఫీచర్ల వినియోగంతో 12 శాతం కాలుష్యాన్ని నియంత్రించనున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios