Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి ఎం‌జి హెక్టార్‌ ప్లస్‌ కొత్త వెరీఎంట్..ధర ఎంతంటే ?

2019 లో ప్రారంభించినప్పటి నుండి కొత్తగా ప్రవేశించిన ఎంజి మోటార్, కియా మోటార్స్ తమ ఉత్పత్తి, సాంకేతిక సమర్పణలతో టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వంటి దిగ్గజ కార్ల తయారీ బ్రాండ్ పోటీగా నిలుస్తున్నాయి. 

MG Hector Plus to launch in India today: price and specifications
Author
Hyderabad, First Published Jul 14, 2020, 12:10 PM IST
న్యూఢిల్లీ: ఆరు సీట్లు కలిగిన ఎస్‌యూవీ హెక్టార్ ప్లస్‌ను ఎంజీ మోటార్స్ ఇండియా సోమవారం విడుదల చేసింది. కారు ధర 13.48 లక్షల నుంచి రూ.18.53 లక్షల మధ్య ఉంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ హెక్టార్, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, జడ్‌ఎస్, ఎలక్ట్రిక్ వెహికల్ తర్వాత హెక్టార్ ప్లస్ మూడో వాహనం కానున్నది. 

నిజానికి ఈ సెగ్మెంట్‌లో వాహనాల విలువ రూ. 16.44. రూ.22.43 లక్షల మధ్య ఉంటుంది. అయితే, పరిచయ ధరలో భాగంగా ప్రస్తుత వాహనాల కంటే తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నట్టు ఎంజీ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు రాజీవ్ చాబా తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో బెస్ట్ టెక్నాలజీతో కార్లను వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. 

భారత్‌లో తమ ప్రయాణం ఏడాది క్రితం తమ తొలి ఇంటర్నెట్ ఎస్‌యూవీ హెక్టార్‌తో ప్రారంభమైనట్టు చెప్పారు. అప్పుడు తాము ఈ ఏడాది మొదట్లో జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసినట్టు రాజీవ్ చాబా పేర్కొన్నారు. 

also read  బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త మోడల్ కార్లు లాంచ్ ! ...  



హెక్టార్ ప్లస్ కారు టర్బో చార్జ్‌డ్ 1.5 లీటర్ల పెట్రోల్ లేదా 2 లీటర్ల డీజిల్ సామర్థ్యం గల ఇంజిన్ కలిగి ఉంది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యం అవుతుంది. స్టయిల్, సూపర్, స్మార్ట్, స్మార్ట్ వేరియంట్లలో వినియోగ దారులకు తమకు నచ్చిన దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

2019లో నూతన మోడల్ కార్ల ఆవిష్కరణ ప్రారంభమైనప్పటి నుంచి టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు ఎంజీ మోటార్స్, కియా మోటార్స్ సవాల్ విసిరాయి. ఎంజీ మోటార్స్ ఆవిష్కరించిన హెక్టర్ మోడల్ కారు ఈ ధరలో తొలి ఆరు నెలల్లో కార్లలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ కారుగా నిలించింది. 

ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగినా హెక్టార్ విక్రయాలు మాత్రం ఆగలేదు. కరోనాను నియంత్రణకు విధించిన లాక్ డౌన్ సడలించిన తర్వాత ఏప్రిల్ నెలాఖరులో ఉత్పాదక పనులు ప్రారంభించిన తొలి ఆటోమొబైల్ సంస్థగా ఎంజీ మోటార్స్ నిలిచింది. 

క్రోమ్ స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్లే, న్యూ హెడ్ ల్యాంప్స్ ఈ కారులో న్యూ ఫీచర్లు ఉన్నాయి. నెక్స్ట్ తరం ఐ-స్మార్ట్ టెక్నాలజీతో చిట్ చాట్ ఫీచర్, స్మార్ట్ స్వైప్, ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, రేర్ టెయిల్ లైట్ డిజైన్, రివైజ్డ్ స్కిడ్ ప్లేట్లు ఇందులో జత చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios