దుర్గాదేవి నవరాత్రులు, దసరా పండగ సీజన్ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ రికార్డ్ స్థాయిలో కస్టమర్లకు డెలివరీలను అందించినట్లు ప్రకటించింది.

 పండుగ సీజన్ లో దేశవ్యాప్తంగా 550  మెర్సిడెస్ బెంజ్ కార్లను కంపెనీ ఓనర్లకు అందజేసింది, 2019లో కూడా రికార్డు స్థాయిలో సేల్స్  నమోదు చేసింది.

ఈ 550 కార్ల్ కస్టమర్ డెలివరీలు ఢీల్లీ ఎన్‌సిఆర్, ముంబై, గుజరాత్, ఇతర ఉత్తర మార్కెట్లలో అందించారు. ఒక్క ఢీల్లీ ఎన్‌సిఆర్‌లోనే 175 కొత్త మెర్సిడెస్ బెంజ్ కార్లను వాటి యజమానులకు అప్పగించారు. 

also read టోర్సస్ ప్రిటోరియన్ హెవీ డ్యూటీ ఆఫ్-రోడ్ స్కూల్ బస్.. ...

ఢీల్లీ ఎన్‌సిఆర్, ముంబై, గుజరాత్ వంటి కీలక మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉందని, సేల్స్ సాధారణ స్థితికి రావడం, డిమాండ్ తిరిగి పుంజుకుందని కంపెనీ తెలిపింది. సి-క్లాస్, ఇ-క్లాస్ సెడాన్లు, జిఎల్‌సి, జిఎల్‌ఇ, జిఎల్‌ఎస్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ “ఈ సంవత్సరం పండుగ సీజన్ చాలా బలమైన  డిమాండ్ తో ప్రారంభమైంది, పాజిటివ్ కస్టమర్ సెంటిమెంట్‌ను చూసినందుకు మేము సంతోషిస్తున్నాము.

ఈ పండుగ సీజన్ లో అద్భుతమైన డెలివరీలు మాకు నమ్మకాన్ని కలిగిస్తాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, ఉత్పత్తులపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని గట్టిగా నొక్కిచెప్పారు. ”