Asianet News TeluguAsianet News Telugu

అవతార్ సినిమా స్ఫూర్తితో ‘బెంజ్’ కార్... జేమ్స్ కేమరూన్​ సాయంతో ఆవిష్కరణ...

అవతార్ సినిమాను మరిపింపజేసింది మెర్సిడెజ్ బెంజ్ కారు. ఆ సినిమాలో వాడిన కారు డిజైన్‌లోనే సరికొత్త టెక్నాలజీతో తయారు చేసింది. ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కూడా ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ కారు మనుషుల మనోభావాలను కనిపెడుతూ ఎదురుగా డిజిటల్ తెరపై తెలియజేస్తుంది.
 

mercedes benz goes hollywood with avatar inspired cyborg concept car
Author
Hyderabad, First Published Jan 8, 2020, 11:12 AM IST

న్యూఢిల్లీ: సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2009లో వచ్చిన అవతార్​ చిత్రం.. బాక్సాఫీస్​ చరిత్రను తిరగరాసింది. ఆ సినిమా స్ఫూర్తితో ప్రముఖ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్​ అద్భుతమైన కారును రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్​ సాయంతో ఈ ఆవిష్కరణ చేసింది. ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కూడా అనూహ్యంగా ఈ ఏడాది కార్ల తయారీ రంగంలో అడుగుపెట్టింది.

also read రికార్డు స్థాయిలో రోల్స్ రాయిస్ కార్ల అమ్మకాలు...

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్​ బెంజ్​.. సరికొత్త కారును ఆవిష్కరించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయ హంగులతో కొత్త కారును రూపొందించింది. ఈ కారుకు ఏవీటీఆర్​ అనే నామకరణం చేసింది మెర్సిడెజ్​. అమెరికా లాస్​వెగాస్​లో జరుగుతున్న కన్​స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో-2020లో దీన్ని ఆవిష్కరించారు. 

ఇదే వేదికగా మెర్సిడెజ్ బెంజ్ ఓ వీడియోను ఆవిష్కరించింది. ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేసింది. కేమరూన్ సాయంతో హాలీవుడ్​ దర్శక దిగ్గజం జేమ్స్​ కేమరూన్​ 'అవతార్' చిత్రం​ థీమ్​తో, ఆయన సాయంతో ఈ కారు రూపుదిద్దుకుందని బెంజ్ సంస్థ తెలిపింది. 

mercedes benz goes hollywood with avatar inspired cyborg concept car

సినిమాల్లోనే కనిపించే గ్రాఫిక్స్​ నిజజీవితంలో సాధ్యమయ్యేలా ఈ కారును రూపొందించింది మెర్సిడెజ్ బెంజ్. ఇందులో ఆర్గానిక్​ ఘటాలతో రూపొందించిన రీసైకిల్​ బ్యాటరీలను అమర్చుతామని మెర్సిడెజ్ బెంజ్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్​ దిగ్గజం సోనీ.. కార్ల వ్యాపారంలో అడుగుపెట్టేందుకు సీఈఎస్​ను వేదికగా చేసుకుంది. అయితే సంప్రదాయ కార్ల తయారీ కాకుండా సరికొత్త ఎలక్ట్రిక్​ కాన్సెప్ట్​తో ఈ కారును సొంత టెక్నాలజీతో రూపొందించింది సోనీ.

also read టాటా నానో కారుకి కష్టాలు....బి‌ఎస్ 6 ఎఫెక్ట్ కారణమా...

'విజన్​-ఎస్​' పేరుతో త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ కారు రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకు వస్తుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ కారు... ప్రయాణ సమయంలో పరిసరాలను సెన్సార్ల ద్వారా స్కాన్​ చేసి సూచనలు ఇస్తుంది. ట్రాఫిక్​తోపాటు ఎదురుగా వస్తున్న వాహనాలపై హెచ్చరికలు జారీ చేస్తుంది.

సోనీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ కెనిచిరో యోషిదా మాట్లాడుతూ ‘ఈ కారులో వినోద అంశాలు జోడించాం. మేం అందిస్తున్న 360 రియాలిటీ ఆడియోతో సంగీతం వినటంలో కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ కారు మనుషుల ఆలోచనలను ముందే పసిగడుతుంది. పెద్ద తెరల ద్వారా వినోదంతో పాటు డ్రైవింగ్ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది’ అని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios