Asianet News TeluguAsianet News Telugu

2012 నాటి స్థాయికి కార్ల సేల్స్.. ఇదీ ఎన్నికల ఎఫెక్ట్.. మరి

మారుతి సుజుకి మొదలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థల కార్ల విక్రయాలు మే నెలలో దారుణంగా పడిపోయాయి. కార్లు, కమర్షియల్ వాహనాల విక్రయాలపైనా ‘ఎలక్షన్స్’ నెగెటివ్ ప్రభావం చూపాయని ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

May Auto Sales Live: Tata Motors Sales Fall 26%, M&M Tractor Sales Decline 16%
Author
New Delhi, First Published Jun 2, 2019, 11:15 AM IST

ఆటోమొబైల్ రంగానికి ఎన్నికల షాక్ తగిలినట్లు ఉంది. ప్రయాణికుల కార్ల తయారీలో అతిపెద్ద సంస్థ మారుతి సేల్స్ గత నెలలో 22% తగ్గాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గమ్మత్తేమిటంటే మారుతి సుజుకి కార్ల విక్రయాలు సుమారు ఎనిమిదేళ్ల క్రితం స్థాయికి పడిపోయాయి. 

ఇలా మారుతి కార్ల విక్రయాలు వరుసగా పడిపోవడం మూడు నెల. 2012 ఆగస్టు స్థాయికి మారుతి కార్ల సేల్స్ పడిపోయాయి. మే నెలలో 22 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అంటే 1.34 లక్షల కార్లు మాత్రమే మారుతి సుజుకి విక్రయించింది. 

గత ఏడాది మే నెలలో ఈ కంపెనీ 1,72,512 కార్లను విక్రయించింది. మే నెలలో దేశీయంగా కార్ల అమ్మకాలు 23.1 శాతం తగ్గి 1,63,200 యూనిట్ల నుంచి 1,25,552 యూనిట్లకు చేరాయి.

మారుతిలో మినీ సెగ్మెంట్ సేల్స్ దారుణంగ 56.7 శాతం పడిపోయాయి. సియాజ్ మోడల్ 10 శాతం పతనమైతే, యుటిలిటి వెహికల్స్ 25.3 శాతం తగ్గిపోయాయి. కాకపోతే వ్యాన్ల విక్రయాలు మాత్రం 29.6 శాతం పెరగడం ఒక్కటే మారుతి సుజుకికి ఊరట. 

ఇదిలా ఉంటే మే నెలలో టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మొత్తం కార్ల అమ్మకాలు 6.2 శాతం తగ్గి 13,940 యూనిట్లు తగ్గాయి. గత ఏడాది మే నెలలో 13,066 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మే నెలలో దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గాయి. అంటే 13,113 యూనిట్ల నుంచి 12,138 యూనిట్లకు చేరాయి. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు కస్టమర్ల డిమాండ్‌ మందగించిన ఫలితంగా అమ్మకాలు తగ్గినట్టు టీకేఎం డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా తెలిపారు.
 
మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం)లో వాహనాల విక్రయాలు  గత ఏడాది ఇదే నెలతో పోల్చితే మూడు శాతం తగ్గి 46,848 యూనిట్ల నుంచి 45,421 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ వాహనాల విక్రయాలు 1.7 శాతం తగ్గి 43,818 యూనిట్ల నుంచి 43,056 యూనిట్లకు చేరాయి. 

చివరకు వ్యవసాయం, వాణిజ్య అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ల విక్రయాలు 16 శాతం పడిపోయాయి. డిమాండ్ మందగించడంతో డీలర్ల వద్ద నిల్వలను క్లియర్ చేయడంపైనే కేంద్రీకరించామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టర్ అధ్యక్షుడు రాజన్ వధేరా చెప్పారు.

సాధారణ వర్షపాతం నమోదైతే మున్ముందు సేల్స్ పెరుగుతాయని అంచనా వేశారు. ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ఒకశాతం తగ్గితే, యుటిలిటీ వెహికల్స్ సేల్స్ మాత్రం ఒకశాతం పెరిగాయి. గమ్మత్తేమిటంటే మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెహికిల్స్ 24 శాతం తగ్గి 1084 యూనిట్లకు తగ్గిపోయాయి. మహీంద్రా కమర్షియల్ వెహికల్స్ 5 శాతం పడిపోయాయి. 

హోండా కార్లు మే నెలలో హోండా కార్స్‌ దేశీయ అమ్మకాలు 27.87 శాతం తగ్గి 15,864 యూనిట్ల నుంచి 11,442 యూనిట్లకు చేరుకున్నాయి.
 
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ వాహనాల విక్రయాలు దేశీయంగా 26 శాతం తగ్గి 54,290 యూనిట్ల నుంచి 40,155 యూనిట్లకు చేరాయి. మార్కెట్ స్తంభించి పోయిందని టాటా మోటార్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్యాసింజర్ సేల్స్ 38 శాతం పడిపోయి 10,900లకు పడిపోయాయి. ఎక్స్ పోర్ట్స్ దారుణంగా 58 శాతం తగ్గాయి. 
 
టూవీలర్ల కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మే నెలలో 62,371 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. క్రితం ఏడాది మేలో 77,697 యూనిట్లు విక్రయిస్తే గత నెల అమ్మకాలు 16.5 శాతం తగ్గాయి.

ఎస్ఎంఎల్ ఇసుజు సేల్స్ 17 శాతం పెరిగాయి. ఎస్కార్ట్ కార్ల సేల్స్ 18 శాతం పడిపోయి 6,827 ట్రాక్టర్లకు చేరాయి. మరోవైపు ఎచిర్ మోటార్స్ వాణిజ్య వాహనాల విక్రయాలు 20 శాతం తగ్గుముఖం పట్టాయి. అంటే 4,801 వాహనాలు అమ్ముడు పోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios