కరోనా యుగంలో ప్రైవేట్ వాహనాల డిమాండ్ వేగంగా పెరిగింది. కానీ ఈ కాలంలో ఇంధన ధరలు, పెట్రోల్ లేదా డీజిల్ కార్లను మెయిన్ టైన్ చేయడం కూడా కాస్త ఖరీదైన విషయమే. ఇటువంటి పరిస్థితిలో సి‌ఎన్‌జి కార్లు మీకు గొప్ప ఆర్థిక ఎంపిక.

ఎందుకంటే పెట్రోల్, డీజిల్  ధరల కంటే సి‌ఎన్‌జి ధర చాలా తక్కువ. ముఖ్యంగా మారుతి సుజుకి కార్లు మీకు మంచి ఆప్షన్. మారుతి ఆల్టో, వాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రీసో వంటి కార్లు రూ.5 లక్షల వరకు లభిస్తాయి. ఏ కారు ఏ ధరకు అందుబాటులో ఉందో, వాటి  ఫీచర్స్ ఎంటో చూద్దాం…

ఆల్టో మైలేజ్ అద్భుతమైనది: మీరు మారుతి సుజుకి ఆల్టో సి‌ఎన్‌జి వెరీఎంట్ కొనాలనుకుంటే, మీరు ఈ కారును రూ 4.33 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఒక కిలో సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది కాకుండా ఈ కారు సి‌ఎన్‌జి కిట్ లీక్ ప్రూఫ్ డిజైన్. ఈ కారు గత 16 సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.  మారుతి సుజుకి ఆల్టో  800 కారు అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా ఉంది.

also read మారుతి ఎస్-ప్రెస్సోకి జీరో సేఫ్టీ రేటింగ్‌.. విరిగిన కాఫీ కప్పుతో టాటా మోటార్స్ కామెంట్.. ...

సెలెరియో కూడా మంచి ఎంపిక: మారుతి సుజుకి సెలెరియో కారు వన్-లీటర్ కె-సిరీస్ ఇంజన్ తో వస్తుంది. ఈ కారు సిఎన్‌జి వెరీఎంట్ 30.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారులో కూడా సిఎన్‌జి కిట్‌ను కంపెనీ అందిస్తోంది. దీని సిఎన్‌జి కిట్ కూడా లీక్ ప్రూఫ్ డిజైన్. అంతే కాకుండా భద్రత విషయంలో కూడా ఈ కారు చాలా బాగుంది. మారుతి సుజుకి సెలెరియో కారు సి‌ఎన్‌జి కిట్  సామర్ధ్యం 10 కిలోలు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఢీల్లీలో రూ.5.60 లక్షలు.

మారుతి వాగన్ఆర్ : మారుతి సుజుకి వాగన్ఆర్ చాలా కాలంగా భారతదేశ మధ్యతరగతికి ప్రజలకి ఇష్టమైన కారు. మీరు ఈ కారును ఎక్స్-షోరూమ్ ధర రూ.5.25 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఎస్-సిఎన్‌జి టెక్నాలజీలో వస్తుంది. దీని సిఎన్‌జి ట్యాంక్ లీక్‌ప్రూఫ్ డిజైన్‌. దీని డ్రైవింగ్ అనుభవం, పికప్ చాలా అద్భుతమైనది.

ఎస్-ప్రెస్సో కూడా మంచి ఎంపిక: మారుతి ఆల్టో 800 కారును ఇష్టపడని మారుతి సుజుకి కస్టమర్లకు ఎస్-ప్రెస్సో కారు దాదాపు అదే బడ్జెట్‌లో మంచి ఎంపిక. దీని ప్రారంభ ధర రూ.4.84 లక్షలు. ఈ కారు మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంది. ఒక కిలో సిఎన్‌జిపై 31.2 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది.