మహీంద్రా థార్ కి పోటీగా ఇండియన్ రోడ్లపై మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ..

మారుతి సుజుకి జిమ్మీ సియెర్రా మూడు-డోర్ల వెర్షన్ కారు, దీనిని అంతకుముందు ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్‌యూవీని 3-డోర్ల వెర్షన్‌లో మాత్రమే అందిస్తున్నారు. మానేసర్‌లోని కంపెనీ తయారీ కర్మాగారం సమీపంలో ఈ ఎస్‌యూవీని టెస్ట్ చేస్తున్నప్పుడు గుర్తించారు.
 

Maruti Suzuki Jimny SUV Spotted Testing For The First Time In India-sak

భారతదేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో మారుతి సుజుకి జిమ్నీ ఒకటి. మారుతి సుజుకి జిమ్మీ సియెర్రా ఎస్‌యూవీని తొలిసారిగా ఇండియన్ రోడ్లపై పరీక్షించారు. మానేసర్‌లోని కంపెనీ తయారీ కర్మాగారం సమీపంలో ఈ ఎస్‌యూవీని టెస్ట్ చేస్తున్నప్పుడు గుర్తించారు.

మారుతి సుజుకి జిమ్మీ సియెర్రా మూడు-డోర్ల వెర్షన్ కారు, దీనిని అంతకుముందు ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్‌యూవీని 3-డోర్ల వెర్షన్‌లో మాత్రమే అందిస్తున్నారు. మారుతి సుజుకి జిమ్నీ  టెస్ట్ మ్యూల్ ఆటొ ఎక్స్‌పోలో చూసిన మోడల్‌తో చాలా పోలి ఉంటుంది.

వైట్ బాడీ కలర్‌లో ఉన్న ఈ ఎస్‌యూవీ క్లాసిక్ బాక్సీ డిజైన్‌, పొడవైన బాడీ నిర్మాణం, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ ఫాగ్ లాంప్స్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, బంపర్స్ ఇంటిగ్రేటెడ్ టెయిల్‌ ల్లైట్స్, సైడ్ స్వింగ్ రియర్ డోర్, ఇంకా  మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

also read ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతి సుజుకి కార్ల పై ఫెస్టివల్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే.. ...

ఇండియన్ మార్కెట్ కోసం సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని రీబ్యాడ్జెడ్ చేసిన జిప్సీగా మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. మారుతి సుజుకి జిమ్నీ లభ్యత పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ విభాగంలో ఇటీవల లాంచ్ చేసిన ఆల్-న్యూ మహీంద్రా థార్, రాబోయే ఫోర్స్ గూర్ఖాతో సుజుకి జిమ్నీ పోటీ పడనుంది.

ఇక జిమ్నీ ధర విషయానికొస్తే 10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీకి ప్రీమియం పొజిషనింగ్ ఉంటుంది, దీనిని మారుతి నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా విక్రయించబడే అవకాశం ఉంది.

గతంలో కొత్త జనరేషన్ జిమ్నీ గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి, ప్రత్యేకంగా 3-డోర్ లేదా 5-డోర్ వెర్షన్ భారతదేశంలో  ప్రవేశపెట్టవచ్చని భావించారు.  జిమ్నీ వాహనం గురించి భారతీయ వినియోగదారుల స్పందనను అంచనా వేయడానికి మాత్రమే దీనిని ఆటొ ఎక్స్‌పోలో ఆవిష్కరించారు.

 కొత్త మారుతి సుజుకి జిమ్నీ 1.5-లీటర్ కె15 బి పెట్రోల్‌ ఇంజన్. 6000 ఆర్‌పిఎమ్ వద్ద 103 బిహెచ్‌పి కోసం ఇంజన్ ట్యూన్ చేయబడింది. 4400 ఆర్‌పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లభిస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios