బాలెనో టు సియాజ్ వరకు ఆఫర్స్: రూ.65 వేల వరకు ఆదా

మారుతి సుజుకి నాలుగు రకాల మోడల్ కార్లపై రూ.65 వేల వరకు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఆఫర్లు తమ నెక్సా డీలర్ల వద్ద కొనుగోలు దారులు పొందొచ్చునని తెలిపింది.

Maruti Suzuki India giving offers of up to Rs 65,000 on cars sold through Nexa dealerships in April 2019

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకి’ తన ఉత్పత్తులపై ఈ నెలలో రూ.65 వేల వరకు రాయితీలు, బెనిఫిట్లు అందజేస్తోంది. సంస్థ ‘నెక్సా’ డీలర్ల వద్ద ఇగ్నిస్, బాలెనో, ఎస్-క్రాస్, సియాజ్ మోడల్ కార్లపై ఈ ఆఫర్లు అందిస్తోంది మారుతి సుజుకి. 

న్యూ 2019 మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ కార్లపై రూ.13 వేల వరకు రాయితీ అందిస్తోంది. ఇంతకుముందు బాలెనో పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.33 వేల ఆఫర్ అందించింది. ఏది ఏమైనా బాలెనో కార్ల కొనుగోలు దారులు రూ.43 వేల వరకు ఆదా చేయొచ్చు. 

ఇక మారుతి పాత తరం ‘ఇగ్నిస్’ మోడల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కారుపై రూ.48 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. న్యూ ఇగ్నీస్ మోడల్ కారు (ఆటోమేటిక్ అండ్ మాన్యువల్) పై రూ.33 వేల వరకు రాయితీ అందిస్తోంది. మారుతి ఇగ్నిస్ కేవలం పెట్రోల్ వర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. 

డీజిల్ వేరియంట్‌లోనే లభించే మారుతి సుజుకి ఎస్-క్రాస్ కారు కొనుగోలుపై రూ.55 వేల వరకు రాయితీని అందిస్తోంది. గతేడాది విపణిలోకి విడుదల చేసిన సియాజ్ మోడల్ కారు కొనుగోలుపై రూ.65 వేల రాయితీ అందిస్తోంది. సియాజ్ అన్ని వేరియంట్లకు ఈ ఆఫర్ లభిస్తుంది. పెట్రోల్ (ఆటోమేటిక్ అండ్ మాన్యువల్), డీజిల్ వేరియంట్లలో సియాజ్ లభిస్తోంది. 

ఇక 2019 మారుతి సుజుకి సియాజ్, సిగ్మా, డెల్టా, జీటా పెట్రోల్ వేరియంట్ కార్ల (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) పై రూ.50 వేల రాయితీ కల్పిస్తోంది. ఆల్పా ట్రిమ్ కారుపై రూ.35వేల ఆఫర్ ప్రకటించింది మారుతి సుజుకి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ కార్లన్నింటిపైనా రూ.35 వేల వరకు బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. 

2019 మారుతి సుజుకి సియాజ్, సిగ్మా, డెల్టా, ఆల్ఫా ట్రిమ్ (1.3 లీటర్ ఇంజన్) కార్లపై రూ.50 వేల బెనిఫిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఆల్ఫా ట్రిమ్ కారుపై, 1.5 లీటర్ల సామర్థ్యం గల నాలుగు రకాల సియాజ్ డీజిల్ మోడల్ కార్లపై రూ.35 వేల వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios