Maruti Suzuki Ertiga: మారుతి సుజుకి నుంచి అతి తక్కువ ధరకు వస్తున్న 7 సీట్ల ఎర్టిగా కారు, ఫైనాన్స్ ప్లాన్ ఇదే..
ఏడు సీటర్ల మల్టీపర్పస్ వెహికల్ కోసం చూస్తున్నారా.. మీ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ మారుతి నుంచి వచ్చినటువంటి ఎర్టిగా వెహికల్ ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు. మారుతి ఎర్టిగాకు సంబంధించి ఫైనాన్స్ అలాగే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఎర్టిగా భారతదేశంలో బడ్జెట్ 7 సీటర్ కార్ కొనుగోలుదారుల కోసం బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటి, ఈ మోడల్ కార్ల ధరలు రూ.8.64 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. మంచి లుక్స్ , ఫీచర్లు అలాగే అద్భుతమైన మైలేజీ కారణంగా, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ MPV కొనుగోలుదారులకు ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది. మారుతి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ ఎమ్‌పివి 1462 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. సిఎన్‌జి ఎంపికలో కూడా అందుబాటులో ఉంది. ఎర్టిగా CNG 26.11 km/kg మైలేజీని అందిస్తుంది. ఎర్టిగా పెట్రోల్ 20.51kmpl మైలేజీని అందిస్తుంది.ప్రస్తుతం మారుతి ఎర్టిగా ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్ , ZXI ప్లస్ రెండు ప్రత్యేక వేరియంట్‌లను పొందవచ్చు.
మారుతి ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్ ధర , ఫైనాన్స్ వివరాలు
మారుతి సుజుకి ZXI ప్లస్ మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.58 లక్షలు. ఆన్-రోడ్ ధర రూ. 13,44,769. మీరు ఈ ఎర్టిగా వేరియంట్‌కి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఫైనాన్స్ పొందితే మీకు రూ. 11,44,769 రుణం లభించే వీలుంది. రుణం కోసం వడ్డీ రేటు 9 శాతం అనుకుంటే , లోన్ కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది, తర్వాత మీరు రూ. 23,764 చొప్పున EMI చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి 60 నెలలకు నెలవారీ వాయిదా చెల్లించాలి. మారుతి సుజుకి ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌కు ఫైనాన్సింగ్ చేయడం వల్ల 5 సంవత్సరాలలో మీరు రూ. 2.8 లక్షలకు పైగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
మారుతి ఎర్టిగా ZXI ప్లస్ ఆటోమేటిక్ ధర, ఫైనాన్స్ వివరాలు
మారుతి సుజుకి Ertiga ZXI Plus ఆటోమేటిక్ వేరియంట్, ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.08 లక్షలు , ఆన్-రోడ్ ధర రూ. 15,16,288. మారుతి ఎర్టిగా , ఈ టాప్ వేరియంట్‌కి మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఫైనాన్స్ చేస్తే, మీరు రూ. 13,16,288 రుణం పొందే వీలుంది. లోన్ కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 9 శాతం అనుకుంటే. అప్పుడు మీరు తదుపరి 5 సంవత్సరాలకు ప్రతి నెలా ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 27,324 చెల్లించాల్సి ఉంటుంది. మారుతి ఎర్టిగాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ వేరియంట్‌కు ఫైనాన్స్ చేయడం వల్ల 5 సంవత్సరాలలో మీకు రూ. 3.2 లక్షలకు పైగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.