ఇంప్రూవైజ్డ్ ఫీచర్లతో మార్కెట్‌లోకి మారుతి న్యూ‘సియాజ్’
ఎల్లవేళలా నూతనత్వాన్ని కస్టమర్లకు పరిచయం చేసే మారుతి సుజుకి తాజాగా అధునాతన ఫీచర్లతో కూడిన ‘సియాజ్’ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.9.97 లక్షలు పలుకుతోంది.
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా కొత్త మోడల్ మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ కారును ఆవిష్కరించింది. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం గల న్యూ సియాజ్ కారును రూ.9.97 లక్షలు పలుకుతోంది.
1.5 లీటర్ల ఇంజిన్, సిక్స్ స్పీడ్ ట్రాన్సిమిషన్, ఇంప్రూవైజ్డ్ పెర్ఫార్మెన్స్ వంటి ఫీచర్లతో ‘సియాజ్’ డీజిల్ మోడల్ కారు మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఇండియా ఫియట్ సోర్స్ డ్ 1.3 లీటర్ల డీజిల్ పవర్ ట్రైన్‌ను మారుతి సుజుకి వినియోగించుకుంటున్నది.
ఎంట్రీ లెవెల్ సియాజ్ డెల్టా వేరియంట్ రూ.9.97 లక్షలు పలుకుతోంది. రూ.11.08 లక్షలకు జెటా, రూ.11.37 లక్షల టాప్ ఎండ్ అల్ఫా ట్రిమ్ మోడల్ కారు అందుబాటులోకి వస్తాయి.
మారుతి సుజకి ఎల్లవేళలా రివల్యూషనరీ ఆఫరింగ్స్‌తో భారత ఆటో పరిశ్రమను రీ డిఫైన్ చేసింది. అల్యూమినియంతో తయారు చేసిన 1.5 లీటర్ల డీడీ ఐఎస్ 225 డీజిల్ ఇంజిన్ మరో టెస్టామెంట్ అని మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు.
బెస్ట్ ఇన్ క్లాస్ ఫ్యూయల్ ఎఫిసియెన్సీతోపాటు ఎన్‌హాన్స్‌డ్ పెర్ఫార్మెన్స్ గల న్యూ ఇంజిన్‌ను ‘మారుతి సుజుకి’ న్యూ ‘సియాజ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన ఇంజిన్‌తో రూపుదిద్దుకున్న న్యూ సియాజ్ మోడల్ కారు మా పోర్ట్ ఫోలియోతో మా కార్లకు ప్రజాదరణ కల్పిస్తుందని అయుకవా తెలిపారు.
నెక్సా నెట్‌వర్క్ ద్వారా ‘సియాజ్’ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ వర్షన్ కారును ఆఫర్ చేస్తోంది. టాప్ ఎండ్ ఆల్ఫా వేరియంట్ ‘సియాజ్’ మోడల్ కార్లు.. మారుతి సుజుకి సేల్స్‌లో 54 శాతంగా నిలిచాయి.