Asianet News TeluguAsianet News Telugu

లీజుకు మహీంద్రా కార్స్.. రెవ్‌తో జట్టు ఇలా..

అమ్మకాలు పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఒకవైపు గ్రామీణ మార్కెట్‌లో విస్తరణకు ప్రయత్నిస్తూనే మరోవైపు కార్లను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ రేవ్ సంస్థతో రెంటల్ ఒప్పందం కుదుర్చుకున్నది.  

Mahindra banks on car rentals to tide over sales slump, inks pact with Revv
Author
New Delhi, First Published Sep 13, 2019, 11:42 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాహనాల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ వాహనాల విక్రయానికి వినూత్న విధానాలకు తెర తీస్తున్నాయి. నవతరం కస్టమర్లు కోరుకుంటున్న మాదిరిగా కంపెనీలు ఈ విధానాలే అనుసరించక తప్పని పరిస్థితి నెలకొంటోంది. 

తాజాగా మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) రిటైల్‌ కొనుగోలుదారుల కోసం సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారిత సర్వీస్ ప్రారంభించింది.
ఇందుకోసం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ రెంటల్‌ ప్లాట్‌ఫామ్‌ రెవ్‌తో జట్టుకట్టింది. 

ఇందులో భాగంగా మహీంద్రాకు చెందిన వ్యక్తిగత శ్రేణి వాహనాలను కస్టమర్లు నిర్దేశిత కాలానికి అద్దెకు తీసుకోవచ్చు. తొలుత ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చండీగఢ్‌, అహ్మదాబాద్‌లో తొలుత ఈ వసతిని అందుబాటులోకి తెచ్చారు. 

వాహనాన్ని బట్టి సబ్‌స్ర్కిప్షన్‌ ధర నెలకు రూ.19,720 నుంచి ప్రారంభం అవుతుంది. మహీంద్రా కేయూవీ 100, ఎక్స్‌యూవీ 500, ఎక్స్‌యూవీ 300, స్కార్పియో, టీయూవీ 300, మరాజో, అల్టూరస్‌ జీ4 వాహనాలను ఈ స్కీమ్‌ కింద మహీంద్రా ఆఫర్‌ చేస్తోంది. 

కొత్త కార్లయితే ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఈ స్కీమ్‌ వాహనాన్ని కింద పొందవచ్చు. మహీంద్రా కారును అద్దెకు తీసుకునే వారు నెలకు ఎంత మొత్తమైతే ఉంటుందో దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

డౌన్‌పేమెంట్‌, రోడ్‌ టాక్స్‌ వంటివి ఏమీ ఉండవు. వాహన రీసెల్‌ రిస్క్‌ ఉండదు. కస్టమర్‌ చెల్లించే సొమ్ములోనే బీమా, రొటీన్‌ మెయింటెనెన్స్‌ వ్యయాలు కలిసి ఉంటాయి. 

కనీస కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్‌ తాను వాడుకుంటున్న వాహనాన్ని తిరిగి ఇచ్చేసి మరో వాహనాన్ని తీసుకోవచ్చు. తాను వినియోగించుకున్న వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.

వాహనాన్ని కొనుగోలు చేయకుండానే తమ కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని అందుబాటు ధరల్లోనే తీసుకుని నచ్చినంత కాలం నడుపుకోవచ్చని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా తెలిపారు. 

ఈ సదుపాయాన్ని మిలీనియల్స్‌ మాత్రమేకాకుండా సొంతంగా ఉపాధిని పొందుతున్నవారు, ఎస్‌ఎంఈలు, స్వల్పకాలానికి వాహనాల అవసరం ఉన్న వారు వినియోగించుకోవచ్చునని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా  అన్నారు. 

వచ్చే మూడు నెలల కాలంలో మరో 11 నగరాల్లోకి ఈ సర్వీసును విస్తరిస్తామని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా చెప్పారు.

వాహనాల విక్రయాలు క్షీణిస్తుండటంతో వాహనాల తయారీ కంపెనీలు, రిటైలర్లు తమ ప్లాంట్లు, షోరూమ్‌లలో పేరుకుపోతున్న వెహికిల్స్‌ విక్రయాలను ఎలాగైనా పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నాయి. 

అయినా అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇప్పటికే తన కార్లను అద్దెకు ఇచ్చేందుకు హ్యుండాయ్‌ ఇండియా రెవ్‌తో జత కట్టింది. గత ఏడాది మహీంద్రా లీజింగ్‌ సర్వీసును ప్రారంభించింది. ఆగస్టులో ప్యాసెంజర్‌ వాహనాల అమ్మకాలు 31.57 శాతం తగ్గి 2,87,198 యూనిట్ల నుంచి 1,96,524 యూనిట్లకు చేరుకున్నాయి.

టయోటా ఫార్చూనర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌
తన ఫార్చూనర్‌ మోడల్‌లో టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ తెచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.33.85 లక్షలుగా నిర్ణయించింది. దేశీ మార్కెట్లోకి టయోటా ఫార్చూనర్‌ అడుగుపెట్టి పదేళ్లయిన సందర్భంగా ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ను తెచ్చినట్లు తెలిపింది. 

2009 నుంచి మార్కెట్లోకి టయోటా ఫార్చూనర్
న్యూ ఫార్చూనర్‌ టీఆర్‌డీ ‘సెలబ్రిటీ ఎడిషన్‌’ పేరుతో తెచ్చిన ఈ ఎస్‌యూవీని టయోటా రేసింగ్‌ డెవలప్మెంట్‌ (టీఆర్‌డీ).. డిజైన్‌, అభివృద్ధి చేసిందని పేర్కొంది.

ఆటోమేటిక్‌ వెర్షన్‌తో డీజిల్‌ వేరియంట్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. 2009లో ఫార్చూనర్‌ మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి భారతీయుల చాయిస్‌గా ఈ ఎస్‌యూవీ నిలిచిందని టయోటా కిర్లోస్కర్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios