బెంట్లే కంపెనీ ఉద్యోగులపై వేటు.. భవిష్యత్తులో ఇంకా ఉంటాయని హెచ్చరికలు..
కరోనా కష్టాలు వివిధ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను వెంటాడుతున్నాయి. తాజాగా బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బ్లెంటీ వెయ్యి మందిని సాగనంపుతున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఉద్వాసనలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
లండన్: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ మేకర్ బెంట్లీ తప్పనిసరి పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు 1000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
అంతేకాదు, భవిష్యత్తులో మరింతమందిని తొలగించే అవకాశం ఉందని బ్లోంటీ హెచ్చరించింది. జర్మనీలోని ఫోక్స్‌వేగన్ గ్రూప్‌నకు చెందిన బెంట్లీ.. ఉద్యోగాల తొలగింపు తొలుత వాలంటరీ స్కీమ్‌లో భాగంగా ఉంటాయని, కానీ భవిష్యత్తులో మాత్రం తప్పనిసరి కోతలు ఉంటాయని పేర్కొంది.
సంస్థ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించబోతున్నట్టు 4200 మంది ఉద్యోగులకు తెలియజేసినట్టు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు బ్లెంటీ పేర్కొంది. కరోనా మహమ్మారి తమ అభివృద్ధి ప్రణాళికలను దారుణంగా దెబ్బతీసిందన్నది.
దురదృష్టవశాత్తు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం అత్యవసరమైందని బెంట్లీ తెలిపింది. లండన్‌కు చెందిన మరో కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్.. 500 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
also read భారత్‌లోకి టయోటా ఫార్చునర్ లేటెస్ట్ మోడల్.. కొత్త అప్ డేట్ ఫీచర్లతో లాంచ్...
టయోటాలో ఈ కార్లు ప్రియం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటర్(టీకేఎం) ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో కమ్రీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోడల్‌తోపాటు ది వెల్ ఫేర్ మోడళ్లు వచ్చే నెల మరింత ప్రియంకాబోతున్నాయి.
ఎక్స్చేంజ్ రేట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్లనే వీటి ధరలను పెంచాల్సి వచ్చిందని ప్రకటించిన టయోటా సంస్థ..ఎంతమేర పెంచుతున్నదో వెల్లడించలేదు. ప్రస్తుతం కమ్రీ హైబ్రిడ్ రూ.37.88 లక్షలకు, వెల్ ఫేర్ మోడల్ రూ.79.5 లక్షలకు లభిస్తున్నాయి. ది వెల్ ఫేర్ మడల్ కారు అత్యంత విలాసవంతంగా ఉండే, శక్తిమంతమైన ఇంజిన్ కల వాహనం కావడంతోపాటు పర్యావరణ హితం ప్లస్ మైలేజీని కూడా ఇస్తుంది.