Asianet News TeluguAsianet News Telugu

మారుతి బ్రెజ్జాకి పోటీగా కియా మోటార్స్ సరికొత్త కారు..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడటానికి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్‌ను కియా మోటార్స్ ఆవిష్కరించింది. కియా సోనెట్ లో 10.25 అంగుళాల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో సహా కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ పరిచయం చేసింది.

kia motors launches ka sonet suv in india
Author
Hyderabad, First Published Aug 8, 2020, 11:11 AM IST

కియా సెల్టోస్, కియా కార్నివాల్ తరువాత కియా మోటార్స్ ఇండియా చివరకు దేశంలో తన మూడవ కారును లాంచ్ చేసింది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడటానికి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్‌ను కియా మోటార్స్ ఆవిష్కరించింది.

కియా సోనెట్ లో 10.25 అంగుళాల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో సహా కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ పరిచయం చేసింది. కొత్త కారు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని కియా ప్లాంట్ వద్ద తయారు చేస్తుంది.

కొత్త కారు త్వరలో భారత మార్కెట్లో లభిస్తుందని, కియా గ్లోబల్ మార్కెట్లలో కూడా విక్రయించబడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రతి ఆరు నుండి తొమ్మిది నెలలకు సరికొత్త ఉత్పత్తిని అందిస్తామని కంపెనీ ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఈ పండుగ సీజన్‌లో సోనెట్ భారతదేశంలో ప్రారంభించనుంది.  

కియా సోనెట్ ఎస్‌యూవీ డిజైన్ 

టీజర్‌లలో చూపించినట్లుగా, కొత్త కియా సోనెట్ ‘టైగర్-నోస్’ గ్రిల్‌ను పొందుతుంది, ‘హార్ట్ బీట్’ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు (పగటిపూట రన్నింగ్ లైట్లు),‘హార్ట్ బీట్’ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్‌ను వెనుక వైపు కూడా చూడవచ్చు. మూడు డ్యూయల్-టోన్ ఎక్స్ టిరియర్ ఆప్షన్స్ లో సోనెట్ అందించబడుతుంది.

 మొదటిది 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, రెండవది పెట్రోల్ 1.0 టి-జిడి టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్. డీజిల్‌పై ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం, సంస్థ 1.5-లీటర్ సిఆర్‌డి ఇంజిన్‌ను ఐదు ట్రాన్స్‌మిషన్ల ఆప్షన్ తో అందిస్తుంది.4

ఇందులో ఐదు, ఆరు-స్పీడ్ గేర్ మాన్యువల్లు, ఏడు-స్పీడ్ డిసిటి, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్, కియా కొత్త సిక్స్-స్పీడ్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి) ఉన్నాయి, ఇవి హ్యుందాయ్ వెన్యూలో కూడా ఉన్నాయి. ఈ విభాగంలో మరొకటి ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది.

సోనెట్ డ్యూయల్ ట్రిమ్ కాన్సెప్ట్‌లో అందించబడుతుంది. ఇది స్పోర్టి జిటి-లైన్ ట్రిమ్‌ ఉంటుంది, జిటి-లైన్ మోడల్స్ సోనెట్‌కు అదనపు స్పోర్ట్‌నెస్‌ను అందిస్తాయి.

also read టివిఎస్ మోటార్స్ అపాచీ బైక్ ధరల పెంపు.. ఎంతంటే ? ...


ఫీచర్స్ 

నావిగేషన్, లైవ్ ట్రాఫిక్‌తో 10.25-అంగుళాల (26.03 సెం.మీ) హెచ్‌డి టచ్‌స్క్రీన్

వైరస్ ప్రొటెక్షన్తో   స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్

బోస్  ప్రీమియం ఏడు-స్పీకర్ ఆడియో

వెంటిలేటెడ్ డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు

ఎల్‌ఈ‌డి సౌండ్ మూడ్ లైటింగ్

యూ‌వి‌ఓ  కనెక్ట్, స్మార్ట్ కీ ద్వారా ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కోసం రిమోట్ ఇంజిన్ ప్రారంభం

ఓవర్-ది-ఎయిర్ (OTA) మ్యాప్ అప్ డేట్

మల్టీ-డ్రైవ్ & ట్రాక్షన్ మోడ్‌లు 

 వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్

 

సేఫ్టీ ఫీచర్స్  

ఆరు ఎయిర్‌బ్యాగులు

ఈ‌బి‌డి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ ) తో ఏ‌బి‌ఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

ఈ‌ఎస్‌సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హెచ్‌ఏ‌సి (హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్), వి‌ఎస్‌ఎం(వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్) బి‌ఏ (బ్రేక్ అసిస్ట్)

ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు

ప్రొజెక్టర్ ఫాగ్ లైట్స్ 

హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్)

ఆటో హెడ్‌ల్యాంప్‌లు

ఐ‌ఎస్‌ఓ‌ఎఫ్‌ఐ‌ఎక్స్  చైల్డ్-సీట్ యాంకరింగ్ పాయింట్లు

Follow Us:
Download App:
  • android
  • ios