అమ్మకానికి డొనాల్డ్ ట్రంప్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు.. వేలంలో పాల్గొనేందుకు మనోడు రెడీ..

ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసేందుకు ఆభరణాల వ్యాపారి బాబీ చెమ్మౌర్   వేలంలో పాల్గొన్నందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.

Kerala jeweller Chemmanur  to bid for President Donald Trump's Rolls-Royce Phantom

 తన ఆభరణాల షోరూమ్ ప్రారంభోత్సవం కోసం ఫుట్‌బాల్ లెజెండ్ దివంగత డియెగో మారడోనాను కేరళకు ఆహ్వణించిన కేరళకు చెందిన ఆభరణాల వ్యాపారి బాబీ చెమ్మౌర్  తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసేందుకు  వేలంలో పాల్గొన్నందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.

ఒక వార్తా పత్రికతో చెమ్మనూర్ మాట్లాడుతూ "అవును, మేము వేలంలో పాల్గొంటున్నాము, మా టెక్సాస్ కార్యాలయం ఇప్పటికే వేలంలో పాల్గొనడానికి చొరవ తీసుకుంది" అని అన్నారు.

also read కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న అద్భుతమైన కార్లు ఇవే.. వాటి ధర, వివరాలు తెలుసుకోండి.. ...

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే వరకు ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారును ఉపయోగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల వేలం వెబ్ సైట్లలో ఒకటైన అమెరికన్ బిడ్డింగ్ వెబ్‌సైట్ మెకం ఆక్షన్స్ ఈ కారును వేలానికి పెట్టింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఒక లగ్జరీ మోడల్ కారు. ఇది ఒక థియేటర్ ప్యాకేజీ, స్టార్ లైట్ హెడ్‌లైనర్, ఎలక్ట్రానిక్ కర్టెన్లు వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ కారు ఇప్పటికే 91,249 కి.మీ ప్రయాణించింది.

రోల్స్ రాయిస్ నిర్మించిన ఈ 2010 మోడల్ ఫాంటమ్ కారు ఆ కాలంలో కంపెనీ తయారు చేసిన 537 కార్లలో ఒకటి.  అనేక దాతృత్వ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే చెమ్మౌర్ తాను ఈ వేలంలో గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.

కారు ధర గురించి అడిగినప్పుడు చెమ్మౌర్ మాట్లాడుతూ  "మేము రూ.3 కోట్ల ప్రారంభ ధరను ఆశిస్తున్నాము, కాని వేల ఎలా ప్రారంభమవుతుందో నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా కారు ప్రేమికులు చాలా మంది ఉండవచ్చు, కాని దాని ఫలితం ఏమిటో తెలియదు " అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios