Asianet News TeluguAsianet News Telugu

జాగ్వార్ బోనంజా: వచ్చే ఏడాది ఐపేస్.. 4.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ‘జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)’ విద్యుత్ వర్షన్ కార్లను మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్‌లోకి విద్యుత్ వినియోగ కారును ఆవిష్కరించనున్నది

Jaguar I-Pace Launch In 2020
Author
New Delhi, First Published Apr 3, 2019, 10:46 AM IST

టాటా మోటార్స్‌ అనుబంధ అంతర్జాతీయ లగ్జరీ కార్ల బ్రాండ్‌ ‘జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)’ పరిస్థితులకు అనుగుణంగా ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులేస్తున్నది. కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న అంతర్జాతీయ సమాజం నిర్ణయానికి అనుగుణంగా ఎలక్ట్రిక్‌ మోడల్ కార్లను ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్లో విడుదల చేయాలనుకుంటోంది. 

అందుకు అనుగుణంగా ప్రస్తుతం లాండ్ రోవర్ విద్యుత్ వర్షన్  కారు ‘రేంజ్ రోవర్’ను పరిమిత స్థాయిలో విడుదల చేయనున్నది. హైబ్రీడ్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ సహా పలు ఎలక్ట్రిఫైడ్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు మంగళవారం జేఎల్‌ఆర్‌ తెలిపింది. 

ఈ ఏడాది చివరికల్లా లాండ్‌రోవర్‌ పోర్ట్‌ఫోలియోలో తొలి హైబ్రిడ్‌ మోడల్‌ను భారత్‌కు తీసుకురానున్నది. 2020 ద్వితీయార్ధంలో తొలి బ్యాటరీ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌  ప్లస్ ఎస్‌యూవీ మోడల్ కారు‘జాగ్వార్‌ ఐ-వేస్’ను లాంచ్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

90కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీతోపాటు రెండు విద్యుత్ మోటార్లు, రెండు యాక్సిల్స్‌ను జాగ్వార్ ఐ-ఫేస్ మోడల్ కారులో అమర్చారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 377 కిలోమీటర్ల నుంచి 467 కిలోమీటర్ల వరకు నడుపవచ్చు. 

వినియోగదారులు తమ అవసరాలను బట్టి 400 పీఎస్, 700 ఎన్ఎం సామర్థ్యం గల మోటార్స్‌ను అమరుస్తారు. ఇక జాగ్వార్ ఐపేస్ కేవలం 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్స్ కార్లను విడివిడిగా, రెండూ ఒకేసారి మార్కెట్లోకి విడుదల చేసేందుకు జాగ్వార్ లాండ్ రోవర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. అంతే కాదు తన 13 మోడల్ రేంజ్ కార్లన్నీ విద్యుద్ధీకరించనున్నది. 

ప్రత్యేకించి భారతదేశంలో విద్యుత్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్ -2’ పథకం కింద ప్రకటించిన రూ.10 వేల కోట్ల ప్యాకేజీలో భాగస్వామి కావాలని తలపోస్తున్నది. 

ఎస్‌యూవీ పీ400ఈ వేరియంట్ కార్లను ఆవిష్కరించనున్నది. 2.0 లీటర్ల పవర్ ట్రైన్, ఇన్ లైన్ 4 సిలిండర్ ఇగ్నీయం ఇంజిన్, 85 కిలోవాట్ల విద్యుత్ మోటార్, 13.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమరుస్తారు. 

విద్యుత్ మోడల్ కార్లను యూరోపియన్ యూనియన్ దేశాల పరిస్థితులకు అనుగుణంగా తమ విద్యుత్ వాహనాలను పరీక్షించినట్లు రేంజ్ రోవర్ తెలిపింది. ఈ కార్లు ఒకసారి చార్జింగ్ చేస్తే 48 కి.మీ. దూరం వెళ్లొచ్చు. గరిష్టంగా 404 పీఎస్ విద్యుత్, 640 ఎన్ఎం పీక్ టార్చ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 

జాగ్వార్ ‘పీ400 ఈ’ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు ధర రూ.1.3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘పీ400ఈ’ మోడల్ కారు వోల్వో ఎక్స్‌సీ 90 టీ 8తో ఢీ కొట్టనున్నది. అయితే జాగ్వార్ ‘ఐ-పేస్’ మోడల్ కారుకు ప్రస్తుతానికి పోటీ కార్లు లేవు. దీని ధర రూ. కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios