లేటెస్ట్ లగ్జరీ, సేఫ్టీ ఫీచర్లతో ఇన్నోవా క్రిస్టా కొత్త ఫేస్ లిఫ్ట్ ఎడిషన్..
ఇండోనేషియాలో ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది, అక్కడ దీనిని టయోటా కిజాంగ్ ఇన్నోవా అని పిలుస్తారు. భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా కొత్త వెర్షన్ అధికారిక బుకింగ్స్ ప్రారంభించనప్పటికి కానీ కొన్ని డీలర్‌షిప్‌లు బుకింగులను అధికారికంగా తీసుకుంటున్నాయి.
జపాన్ కార్ల తయారీ కంపెనీ టయోటా అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇన్నోవా క్రిస్టా కొత్త వెర్షన్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇండోనేషియాలో ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది, అక్కడ దీనిని టయోటా కిజాంగ్ ఇన్నోవా అని పిలుస్తారు.
భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా కొత్త వెర్షన్ అధికారిక బుకింగ్స్ ప్రారంభించనప్పటికి కానీ కొన్ని డీలర్‌షిప్‌లు బుకింగులను అధికారికంగా తీసుకుంటున్నాయి. కంపెనీ 2016లో సెకండ్ జనరేషన్ ఇన్నోవా క్రిస్టాను ప్రవేశపెట్టింది, దీని తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో బిఎస్ -6 స్టాండర్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో ఇన్నోవా క్రిస్టాను కంపెనీ ప్రవేశపెట్టింది.
ఇన్నోవా క్రిస్టా కొత్త ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ లో కూడా పెద్ద మార్పులను చేసింది. దీని ఫ్రంట్ గ్రిల్ పాత మోడల్ కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు భాగంలోని బంపర్లు, ఫగ్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ హెడ్‌ల్యాంప్‌లు కొత్తగా ఉంటాయి.
also read 5 లక్షల బడ్జెట్‌లో లభించే బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే.. ...
ఈ కారుకి 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ డైమండ్-కట్ ఫినిషింగ్ తో వస్తుంది. పాత వెర్షన్ కంటే మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే, కొత్త మోడల్ ఇంటీరియర్ డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదు, సీటింగ్ అమరిక కూడా మునుపటిలాగే ఉంటుంది.
ప్రస్తుత మోడల్ కొత్త అప్ డేట్స్ పూర్తిగా సాంకేతికంగా ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌లో కొత్త మార్పులు జోడించారు. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే రెండింటికి సపోర్ట్ చేస్తుంది. కొత్త ఇన్నోవా కారులో ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీల కెమెరా కూడా ఇచ్చారు.
ఇవి కాకుండా క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, 7 ఎయిర్‌బ్యాగులు వంటి ఇతర భద్రతా లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజన్, 2.4 లీటర్ల డీజిల్ ఇంజన్ వెరీఎంట్లో వస్తుంది. 148 హార్స్‌పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ కొత్త కారు ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయితే ప్రస్తుత ఎడిషన్ కంటే దీని ధర రూ.50 వేలు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. పండుగ సీజన్లో మీరు కారు కొనాలనుకుంటే ఇన్నోవా లేటెస్ట్ వెర్షన్ పరిగణించవచ్చు. దాని విభాగంలో ఈ కారు అన్ని ఆధునిక ఫీచర్లతో కూడి ఉంది.