Asianet News TeluguAsianet News Telugu

మారుతి సుజుకి ఆల్టో మరో రికార్డు.. ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ కార్..

ఆల్టో కారు 16 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. 76% కస్టమర్లు తొలి ఎంపిక ఆల్టో కారేనని కంపెనీ    తెలిపింది. మారుతి సుజుకి ఆల్టో కారు ఇండియాలో ప్రారంభించిన 20 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది.

 

Indias highest-selling car Maruti Suzuki Alto crosses 40 lakh unit sales
Author
Hyderabad, First Published Aug 14, 2020, 11:44 AM IST

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ కారు  ఆల్టో 40 లక్షల సేల్స్ మార్క్ దాటిందని తెలిపింది. భారతదేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక కారుగా అవతరించింది. ఆల్టో కారు 16 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. 76% కస్టమర్లు తొలి ఎంపిక ఆల్టో కారేనని కంపెనీ    తెలిపింది.

మారుతి సుజుకి ఆల్టో కారు ఇండియాలో ప్రారంభించిన 20 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది, ఎందుకంటే ఈ కారు 2000 సంవత్సరంలో తిరిగి మొదటిసారిగా మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాల తరువాత అంటే 2008 సంవత్సరంలో ఆల్టో కార్ 10 లక్షల అమ్మకాల మార్కును తాకింది.

తరువాతి 10 లక్షల యూనిట్ సేల్స్ కేవలం నాలుగేళ్లలో చేరుకుంది. ఆల్టో 2012 సంవత్సరంలో 20 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. దీని తరువాత, ఈ కారు 2016 సంవత్సరంలో మొత్తం 30 లక్షల యూనిట్ల అమ్మకాలను నివేదించింది,.

also read కారు కొంటున్నారా, ఈ ఫీచర్స్ పై ఓ లుక్కే యండి.. లేదంటే.... ...

ఆ తర్వాత 40 లక్షల మైలురాయిని ఇటీవల దాటింది. భారతదేశంలో మారుతి సుజుకి ఆల్టో ధర ప్రస్తుతం రూ .2.94 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) వద్ద ప్రారంభమవుతుంది. ఈ కారు మొత్తం ఎనిమిది వేరియంట్లలో రెండు సి‌ఎన్‌జి మోడళ్లతో సహా లభిస్తుంది.

పెట్రోల్‌ వెరీఎంట్ మైలేజ్ 22.05 కిలోమీటర్లు, సిఎన్‌జి వెర్షన్‌ మైలేజ్ 31.56 కి.మీ  మైలేజ్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సాధించిన ఈ విజయంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఆల్టో కారు వరుసగా 16 వ సంవత్సరం కూడా ఇండియాలో అమ్ముడైన నంబర్ 1 కారుగా నిలిచిందని, కంపెనీ ప్రకటించినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఇది మరే ఇతర భారతీయ కారు సాధించని సేల్స్ రికార్డుగా మారిందని ఆయన అన్నారు. భారతదేశపు తొలి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా  సరికొత్త  భద్రతా  ఫీచర్లతో కూడి ఉందని పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios