మొట్టమొదటి అటానమస్ ప్రీమియం ఎస్‌యూవీ ఎంజి గ్లోస్టర్ లాంచ్..
ఎంజి గ్లోస్టర్ కార్ భారతదేశంలో 4 ఫీచర్-ఇంటెన్సివ్ వేరియంట్లలో లభిస్తుంది. సూపర్, స్మార్ట్, షార్ప్ ఇంకా సావి. కారులో విలాసవంతమైన బకెట్ సీట్లు, టూ-వీల్ డ్రైవ్ (2డబ్ల్యుడి), ఫోర్-వీల్ డ్రైవ్ (4డబ్ల్యుడి), ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో సహా రెండు ఇంజన్ ఆప్షన్ లలో లభిస్తుంది.
గురుగ్రామ్, అక్టోబర్ 8, 2020: వాహన తయారీ సంస్థ ఎంజి మోటార్స్ ఇండియా భారతదేశపు మొదటి అటానమస్ (లెవల్ 1) ప్రీమియం ఎస్‌యూవీ ఎంజి గ్లోస్టర్ కారుని ఆవిష్కరించింది. దాని డిజైన్, ఫీచర్స్ తో ఎంజి గ్లోస్టర్ ప్రీమియం, లగ్జరీ కార్ల విభాగంలో 25 లక్షల నుండి మొదలై 50 లక్షల రూపాయల వరకు ధర ఉంటుంది.
ఎంజి గ్లోస్టర్ కార్ భారతదేశంలో 4 ఫీచర్-ఇంటెన్సివ్ వేరియంట్లలో లభిస్తుంది. సూపర్, స్మార్ట్, షార్ప్ ఇంకా సావి. కారులో విలాసవంతమైన బకెట్ సీట్లు, టూ-వీల్ డ్రైవ్ (2డబ్ల్యుడి), ఫోర్-వీల్ డ్రైవ్ (4డబ్ల్యుడి), ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో సహా రెండు ఇంజన్ ఆప్షన్ లలో లభిస్తుంది. సావి ట్రిమ్ వేరియంట్ 35.38 లక్షల ధరతో అటానమస్ లెవల్ 1 ఫీచర్స్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)కారు.
ఎంజి గ్లోస్టర్ కార్ ఫీచర్స్
ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ ఉన్నాయి. ఎంజి మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి పర్సనలైజేడ్ కార్ మ్యానేజ్మెంట్ ప్రోగ్రామ్ “MY MG SHIELD” ను గ్లోస్టర్ కొనుగోలుతో పరిచయం చేసింది.
also read పెళ్లిరోజు సందర్భంగా హిరోయిన్ కి రూ.2.65 కోట్ల గిఫ్ట్.. ...
గ్లోస్టర్ స్టాండర్డ్ గా 3 + 3 + 3 ప్యాకేజీతో వస్తుంది అంటే మూడు సంవత్సరాల / 100,000 కిలోమీటర్ల వారంటీ, మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ ఆసిస్టన్స్, మూడు సంవత్సరాల లేబర్ ఫ్రీ సర్వీస్ అందిస్తుంది. MY MG SHIELD కింద, గ్లోస్టర్ కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా మ్యానేజ్మెంట్ ప్యాకేజీలను మరింత అనుకూలీకరించవచ్చు. దసరా నవరాత్రి నుండి గ్లోస్టర్ కార్ల డెలివరీలు ప్రారంభమవుతాయి.
ధర ప్రకటనపై ఎంజి మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ “గ్లోస్టర్ కార్ తన విభాగంలో సాటిలేని లగ్జరీ, టెక్నాలజీ కార్. ఆఫ్-రోడింగ్ అనుభవానికి కొత్త బెంచ్ మార్కును ఏర్పాటు చేస్తుందని మేము నమ్ముతున్నాము. పర్సనలైజేడ్ MY MG SHIELD ఆఫ్టర్ సేల్స్ ప్యాకేజీలు వినియోగదారులకు మరింత ప్రత్యామ్నాయాలను అందిస్తాయి.
ఈ ఫీచర్స్ మా వినియోగదారుల అంచనాల కంటే ఎక్కువ ప్రయోజనలు అందించడానికి అనుగుణంగా ఉన్నాయి. గ్లోస్టర్ షార్ప్, సావి ట్రిమ్స్ ఇంటెలిజెంట్ ఆల్-టెర్రైన్ సిస్టమ్‌ను అందిస్తాయి, ఇది వాహన ఆఫ్-రోడింగ్ సమయంలో మెరుగైన కంట్రోలింగ్ అందిస్తుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై టెక్నాలజీ ఇందులో ఉంది.
ఈ రెండూ వేరియంట్లలో 7 వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తాయి. స్నో, మడ్, ఇసుక, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్. గ్లోస్టర్ ఐ-స్మార్ట్ 2.0, సావీ ఇంకా షార్ప్ కోసం 70కి పైగా కనెక్ట్ కార్ ఫీచర్లతో వస్తుంది. 64-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్ సీట్ మసాజర్, 12-వే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ డ్రైవర్ సీటుతో వస్తుంది. ఎంజి గ్లోస్టర్ ఎక్స్ షోరూమ్ న్యూ ఢిల్లీ ధర 28.98 లక్షల రూపాయల నుండి ప్రారంభవుతుంది.
ప్రీమియం ఎస్‌యూవీలోని నాలుగు వేరియంట్ల బుకింగ్ కోసం మొత్తం రూ. 100,000 లకే చెల్లించాలి. వెబ్‌సైట్ www.mgmotor.co.in లేదా మై ఎంజీ మొబైల్ యఫ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఎంజి మోటర్స్ ఇండియా గురించి
1924లో యుకెలో స్థాపించిన మోరిస్ గ్యారేజ్ స్పోర్ట్స్ కార్లు, రోడ్‌స్టర్‌లు, క్యాబ్రియోలెట్ సిరీస్‌లకు ప్రపంచ ప్రసిద్ధి. ఎంజీ వాహనాల స్టైలింగ్, ఉత్సాహభరితమైన పనితీరు కోసం బ్రిటిష్ ప్రధానమంత్రులు, బ్రిటిష్ రాయల్ కుటుంబికులతో సహా చాలా మంది ప్రముఖులకు మొదటి ఎంపిక.
1930లో యుకె లోని అబింగ్‌డన్‌లో స్థాపించబడిన ఎంజీ కార్ క్లబ్ వేలాది మంది విశ్వసనీయ అభిమానులను పొందింది, ఈ కార్ బ్రాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఎంజీ గత 96 సంవత్సరాలుగా ఆధునిక, భవిష్యత్, వినూత్న బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది. ఎంజి మోటర్స్ ఇండియా తన కార్ల తయారీ కర్మాగారం గుజరాత్‌లో ఉంది.