ప్రీమియం వాహనాల కోసం ఇండియాలో మొట్టమొదటి ఎక్స్‌పి100 పెట్రోల్ లాంచ్ చేసిన ఇండియన్ ఆయిల్..
100 ఆక్టేన్ పెట్రోల్ ప్రత్యేకంగా ప్రీమియం కార్లు, బైకుల కోసం ఉపయోగించబడుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక ఆక్టేన్ ఇంధనం 99 రాన్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) అందించింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) దేశంలో మొట్టమొదటి ఎక్స్‌పి 100 అని పిలవబడే 100 ఆక్టేన్ పెట్రోల్‌ని ప్రారంభించింది, 100 ఆక్టేన్ పెట్రోల్ ప్రత్యేకంగా ప్రీమియం కార్లు, బైకుల కోసం ఉపయోగించబడుతుంది.
ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక ఆక్టేన్ ఇంధనం 99 రాన్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) అందించింది. కొత్త ఎక్స్‌పి 100 ఇంధనం నాణ్యత పరంగా కాస్త ఎక్కువగా ఉంటుంది, తదనుగుణంగా దీని ధర ఢీల్లీలో లీటరుకు రూ.160. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఢీల్లీ-ఎన్‌సిఆర్‌లో లభించే 91 రాన్ ఆక్టేన్ పెట్రోల్ కంటే రూ.77 ఎక్కువ.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను అభినందిస్తూ, పెట్రోలియం & న్యాచురల్ గ్యాసెస్, స్టీల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ "ఈ ఇంధనంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన దేశాలలో 100 లేదా అంతకంటే ఎక్కువ ఆక్టేన్ కలిగిన పెట్రోల్ విక్రయిస్తున్నా జాబితాలో చేరింది.
also read యమహా ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ కొత్త విటేజ్ ఎడిషన్.. బ్లూటూత్ కనెక్టివిటీతో ప్రత్యేకమైన ఫీచర్స్.. ...
ఎక్స్‌పి 100 వంటి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ప్రారంభించటం అనేది అందరికీ మెరుగైన ఇంధన పరిష్కారాలను అందించడంపై మేము దృష్టి కేంద్రీకరించామని రుజువు చేస్తుంది. వీటిని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అమలు చేస్తున్నారనేది గర్వించదగ్గ విషయం. "
ఈ ప్రారంభోత్సవంలో ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య మాట్లాడుతూ, "ఎక్స్‌పి 100 అనేది అల్ట్రా మోడ్రన్, అల్ట్రా ప్రీమియం ఉత్పత్తి. మీ వాహనానికి అధిక శక్తిని, పనితీరును ఇస్తుంది. అలాగే మీకు సంతోషకరమైన డ్రైవ్ అందిస్తుంది " అని అన్నారు.
ఇండియన్ అయిల్ ఆర్‌అండ్‌డి అభివృద్ధి చేసిన స్వదేశీ ఆక్టామాక్స్ టెక్నాలజీని ఉపయోగించి కొత్త ఇండియన్ ఆయిల్ ఎక్స్‌పి 100 ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌ను మధుర రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్నారు. హై ఆక్టేన్ ఇంధనం అధిక కంప్రెషన్ ఇంజన్ గల సూపర్ కార్లు, బైక్‌లపై బాగా పనిచేస్తుంది. ఇండియన్ ఆయిల్ ప్రకారం ఇండియాతో పాటు యు.ఎస్, జర్మనీతో సహా ఆరు ఇతర దేశాలలో ఈ ఇంధనం లభిస్తుంది.
కొత్త ఎక్స్‌పి 100 ఇంధన స్టేజ్ 1లోని 10 నగరాలలో ఎంపిక చేసిన రిటైలర్లతో లభిస్తుంది. ఇందులో ఢీల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, జైపూర్, చండీఘడ్, ముంబై, లుధియానా, అహ్మదాబాద్, పూణే ఉన్నాయి. ఈ సంస్థ రెండో దశలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్ వంటి నగరాలకు విస్తరించనుంది. ఈ నగరాలను జనాభా, ప్రీమియం వాహనాల లభ్యత ఆధారంగా ఎంపిక చేసినట్లు కంపెనీ తెలిపింది.