హ్యుందాయ్ ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్ లాంచ్‌తో హ్యుందాయ్ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. వాస్తవానికి, హ్యుందాయ్ సంస్థ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటా కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడంపై, మా ఫోరమ్‌లలో, సోషల్ మీడియాలో కూడా దీని గురించి మమ్మల్ని చాలా మంది అడుగుతున్నరు. హ్యుందాయ్ క్రెటా 2020 మోడల్ త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని మేము ఇప్పుడు చెప్పలేకపోవచ్చు.

also read CES 2020: హోండా నుండి ఆగ్మెంటెడ్ డ్రైవింగ్ కాన్సెప్ట్‌ కార్

కొరియాలోని హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని  మార్చి 2020 మధ్య నాటికి కొత్త తరం క్రెటా  కార్లు వస్తాయని ఒక పత్రిక తెలిపింది. సెకండ్ జెనరేషన్ హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు, ప్రజాదరణ పరంగా దాని సక్సెస్ అనుకరించాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఈ కారు దాని విభాగంలో ప్రముఖ కార్లలో ఒకటిగా ఉంది, కియా సెల్టోస్, ఎంజి హెక్టర్ వంటి కొత్తగా ప్రవేశించిన కార్లు ఈ ఎస్‌యూవీకి పోటీగా ఉన్నాయి.

హ్యుందాయ్ కంపెనీ దేశంలో కొత్త-జెన్ క్రెటాను టెస్ట్ చేస్తుంది. ఈ కొత్త మోడల్లో మేము ఎల్‌ఈ‌డి బ్యాక్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ అంశాలను స్పష్టంగా మార్చివేశము. వెనుక నంబర్ ప్లేట్ హౌసింగ్ పైకి మార్చేశారు. సైన్ క్యాస్కేడింగ్ గ్రిల్, డి‌ఆర్‌ఎల్ మరియు ఎల్‌ఈ‌డి లైట్లను సులభంగా గుర్తించవచ్చు. అంతేకాక, నెక్స్ట్-జెన్ క్రెటా కారు సైజు కూడా పెరిగింది.


నెక్స్ట్ జెనరేషన్ హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్ లాగానే పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంటుంది. కాబట్టి, ఒక బిఎస్ 6 కంప్లైంట్ సిరీస్, 1.5 పెట్రోల్ & 1.5 డీజిల్ ఇంజన్,  అలాగే 140 బిహెచ్‌పి, 1.4-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ అప్షనల్  7-స్పీడ్ డిసిటి (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్), మూడు ఇంజన్ రకాలలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. డీజిల్ ఇంజన్లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అప్షన్  ఆశించవచ్చు.

also read  అద్భుతమైన ఫీచర్లతో హ్యుండాయ్ లేటెస్ట్ మోడల్ కార్....


 కొత్త-జెన్ హ్యుందాయ్ క్రెటా కారు లోపల ఇప్పుడు కొంచెం పెద్ద 10.4-అంగుళాల స్క్రీన్‌ ఉండవచ్చు. స్క్రీన్ పోర్ట్రెయిట్ మోడ్‌ లేఅవుట్‌ లాగా ఉంటుంది. హ్యుందాయ్  బ్లూ లింక్ కనెక్ట్  కార్ యాప్, టెలిమాటిక్స్ సొల్యూషన్‌తో ఉంటుంది. అన్ని డేటా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి ఇ-సిమ్ లేదా ఎంబెడ్ సిమ్ కార్డ్ లభిస్తుంది.


కారు లోపల సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేక్‌లు), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) స్టాండర్డ్, ఈ కారులో 6-ఎయిర్‌బ్యాగ్ టాప్ స్పెక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సన్‌రూఫ్‌, ఇన్‌బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్ అడ్జస్ట్ ఫ్రంట్ సీట్లు, బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సర్విస్ ఉంటాయి.