విటారా బ్రెజ్జా, ఎకో స్పోర్ట్, నెక్సాన్ లతో హ్యుందాయ్ పోటీ...నూతన వెన్యూ పై ఆశలు

యుటిలిటీ వెహికల్స్ విభాగంలో భారతదేశంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఫలితంగా మారుతి సుజుకి విటారా బ్రెజా, ఫోర్ట్ ఎకో స్పోర్ట్, టాటా నెక్సన్ తదితర మోడల్ కార్లతో ఢీ కొట్టేందుకు హ్యుండాయ్ మోటార్స్ సంసిద్ధమైంది. తాజాగా ‘వెన్యూ’పేరుతో నూతన తరం యుటిలిటీ వెహికల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు హ్యుండాయ్ రంగం సిద్ధం చేస్తోంది.

Hyundai to unveil compact SUV 'Venue' with new blue link tech

న్యూడిల్లీ: ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేకించి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) విభాగంలో వివిధ కార్ల తయారీ సంస్థల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థల మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్ట్ ఎకో స్పోర్ట్, టాటా నెక్సాన్ మోడల్ కార్లతో తలపడేందుకు దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ సిద్ధం అవుతోంది. 

హ్యుండాయ్ నూతన ‘వెన్యూ’ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. విటారా బ్రెజా, ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మోడల్ కార్లను ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది. హ్యుండాయ్ సంస్థ నెల వారీగా 7,000-8,000 వాహనాల విక్రయం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 

ప్రస్తుతం మార్కెట్‌లో హ్యుండాయ్ మూడో స్థానంలో ఉంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా నెలవారీ సేల్స్ 13 వేల వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుండాయ్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సియోన్ సియోబ్ కిమ్ మాట్లాడుతూ వైవిధ్య భరితమైన కనెక్టివిటీ సొల్యూషన్స్‌లో భాగంగా మాస్ సెగ్మెంట్‌లో తొలి వాహనాన్ని వినియోగదారుల ముంగిట ఆవిష్కరించబోతున్నదన్నారు. 

‘హ్యుండాయ్ గ్లోబల్ బ్లూ లింక్ కనెక్టివిటీ సొల్యూషన్ మా వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. హ్యుండాయ్ బ్లూ లింగ్ భారతదేశంలో 33 ఫీచర్లలో ఆవిష్కరించనున్నది. వాటిల్లో 10 స్థానిక కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినవే’ అని పేర్కొన్నారు. 

హ్యుండాయ్ హైదరాబాద్ నగరంలోని ఆర్ అండ్ డీ సెంటర్‌లో 800 మంది ఇంజినీర్లలో 36 మంది ఇంజినీర్ల టీం.. గ్లోబల్ ఆర్ అండ్ డీ టీంతో కలగలిసి ‘వెన్యూ’ కారు సొల్యూషన్ పరిష్కారం కనుగొన్నారు. నెక్స్ట్ జనరేషన్ కార్లు‘ఐ20 యాక్టివ్’, క్రెటా మోడల్ కార్లలోనూ ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు.  తొలి ఆరు యుటిలిటీ వెహికల్స్‌ను భారతదేశంలోనే హ్యుండాయ్ అభివ్రుద్ధి చేసింది. 

భారతదేశంలో శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్న యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్. గత ఐదేళ్లలో 9.2 లక్షల యూనిట్ల ఎస్‌యూవీ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ద్రవ్య లభ్యతలో అనిశ్చితి, అధిక బీమా చెల్లింపు, నూతన తరం కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలతో గత కొన్ని నెలలుగా కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 15 లక్షల వాహనాలను విక్రయించాలని హ్యుండాయ్ లక్ష్యంగా పెట్టుకున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios