30 నిమిషాల చార్జింగ్: 350కి.మీ ప్రయాణం...జూలై 9న మార్కెట్లోకి ''కొనా''

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ దేశీయ మార్కెట్లోకి విద్యుత్ వినియోగ కారు ‘కొనా’ ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. 30 నిమిషాల్లో శరవేగంగా చార్జింగ్ అయితే 350 కి.మీ. దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ. ఇక దీన్ని జూలై 9న భారత విపణిలోకి విడుదల చేసేందుకు హ్యుండాయ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతేకాదు భారత మార్కెట్లో తొలుత విడుదలవుతున్న విద్యుత్ కారు కూడా ‘కొనా’ కావడం మరో ప్రత్యేకత. 

Hyundai Kona Electric India Launch Details Out

న్యూఢిల్లీ: ఇటీవలే ఎస్ యూవీ సెగ్మెంట్ సబ్ కంపాక్ట్ మోడల్ ‘వెన్యూ’ కారును విపణిలోకి విడుదల చేసిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్’ తాజాగా మరో మోడల్ కారును ఆవిష్కరించడానికి సిద్ధం అవుతోంది. ఈ దఫా విద్యుత్ వినియోగ కారును హ్యుండాయ్ మార్కెట్లోకి విడుదల చేస్తుండటమే ప్రత్యేకత. 

అన్ని కార్ల తయారీ సంస్థల కంటే ముందుగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విద్యుత్ వినియోగ కారు ‘కొనా’ మోడల్‌ను వినియోగదారుల దరికి చేర్చాలని హ్యుండాయ్ దూకుడుగా ముందుకు వెళుతోంది. జాలై తొమ్మిదో తేదీన హ్యుండాయ్ ‘కొనా’ విద్యుత్ కారు వినియోగదారుల ముంగిట్లోకి రానున్నది. దీనికి అదనంగా మరో రెండు మోడల్ అప్ డేటెడ్ కార్లు విపణిలోకి రానున్నాయి. 

హ్యుండాయ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వెన్యూ, క్రెట్టా, కొనా మోడల్ కార్లు ఉన్నాయి. వీటితోపాటు టక్సన్ మోడల్ కారు ఫేస్ లిఫ్ట్‌తో ఈ ఏడాది ద్వితీయార్థంలో విపణిలోకి రానున్నది. చెన్నైలోని ఉత్పాదక యూనిట్‌లో విద్యుత్ వినియోగ కారు ‘కొనా’ ఉత్పత్తి చేస్తున్నారు. అంతే కాదు విద్యుత్ వినియోగ కార్ల ఉత్పత్తి, అసెంబ్లింగ్ కోసం హ్యుండాయ్ సంస్థ రూ.7000 కోట్ల మేరకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. 

నూతన టెక్నాలజీ, మెషినరీతో కార్ల ఉత్పత్తికి చర్యలు తీసుకోవడంతో దేశీయంగా 1500 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి.  హ్యుండాయ్ ‘కొనా’ విద్యుత్ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. 30 నిమిషాల్లోనే ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకత. అంతర్జాతీయంగా కొనా మోడల్ కారు 100 కిలోవాట్స్ మోటార్, 150 కిలో వాట్స్ మోటార్ సామర్థ్యంతో విడుదల చేస్తోంది హ్యుండాయ్. 

134 బీహెచ్పీ నుంచి 201 బీహెచ్పీ వరకు ఇంధన సామర్థ్యం పెంచుకోవడం మరో స్పెషాలిటీ. రెండు మోటార్ కార్లలో ఎలక్ట్రానిక్ ట్రాన్సిమిషన్ ఏర్పాట్లు చేశారు. 8.0- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ప్లస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios