టకాటా ఎయిర్ బ్యాగ్స్ ప్రాబ్లం: 16 లక్షల హోండా కార్లు రీకాల్‌

టకాటా సంస్థ రూపొందించిన ఎయిర్ బ్యాగ్స్ వల్ల తలెత్తిన ఇబ్బందులతో 16 లక్షల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు హోండా కార్స్ ప్రకటించింది. 

Honda recalls 1.6 million vehicles over Takata airbags

వినియోగ దారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మరోసారి ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హోండా’భారీగా కార్లను రీకాల్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌ బ్యాగ్‌ లోపాల వల్ల అమెరికాలో 16 లక్షల వాహనాలను రీకాల్ చేస్తామని హోండా తెలిపింది.

అమెరికా జాతీయ రహదారుల ట్రాఫిక్ భద్రతా సంస్థ నిర్ణయించిన గడువుకు ఆరు నెలల ముందే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లోప భూయిష్ట టకాటా ఎయిర్ బ్యాగ్‌లను రీప్లేస్‌ చేస్తామని హోండా కార్స్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కార్లను, అమెరికాలో దాదాపు 12.9 మిలియన్ల హోండా, అకూరా ఆటోమొబైల్స్‌ కార్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలను సరి చేసి రీప్లేస్‌ చేశామని పేర్కొంది. 

కాగా 2013 నుండి తకాటా ఎయిర్‌బ్యాగ్‌లలోని లోపాలతో సంభవించిన  ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. దీంతో  అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సీరియస్‌గా స్పందించింది.

దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఫిర్యాదులు అందాయి. కనుక కార్ల వినియోగదారులు తమ డీలర్ల వద్ద పేర్లు నమోదు చేసుకుంటే సరి.. ఉచితంగానే టకాటా ఎయిర్ బ్యాగులను రీప్లేస్ చేస్తామని తెలిపింది. 

ఇప్పటికే 83 శాతం కార్లను రీ ప్లేస్ చేశామని హోండా కార్స్ తెలిపింది. 2017 జూన్ నెలలో ఎయిర్ బ్యాగ్ అంశం టాకాటా సంస్థ దివాళా ప్రకటించడానికి దారి తీసింది కూడా. సదరు ఎయిర్ బ్యాగుల్లో వాడే కెమికల్ డ్రైయింగ్ ఏజంట్ అవి రప్చర్ కావడానికి కారణమైందన్న విమర్శ ఉంది. 

టకాటా రూపొందించిన ఎయిర్ బ్యాగులను వాడటం వల్ల అమెరికాలోని 19 ఆటో మేకర్లకు చెందిన 3.7 కోట్ల కార్లపై ప్రతికూల ప్రభావం పడింది. వాటిల్లో వేల కార్లను సదరు సంస్థలు రీకాల్ చేశాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios