రిఫ్రెష్ లుక్స్, ప్రీమియం స్టైలింగ్ తో సరికొత్త హోండా జాజ్..

హోండా జాజ్ 2020 మాన్యువల్ వెరీఎంట్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలు నుండి మొదలై రూ .8.74 లక్షల వరకు ఉంటుంది. సివిటి వెర్షన్ ధర రూ .8.50 లక్షల నుండి రూ .9.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) వరకు ఉండనుంది.

Honda Jazz  New (2020)Premium Hatchback Launched In India: Prices Start At Rs 7.50 Lakh

న్యూ ఢీల్లీ: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) బుధవారం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ న్యూ హోండా జాజ్‌ను రిఫ్రెష్ లుక్స్, ప్రీమియం స్టైలింగ్ తో  విడుదల చేసింది. హోండా జాజ్ 2020 మాన్యువల్ వెరీఎంట్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలు నుండి మొదలై రూ .8.74 లక్షల వరకు ఉంటుంది. సివిటి వెర్షన్ ధర రూ .8.50 లక్షల నుండి రూ .9.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) వరకు ఉండనుంది.

జాజ్ లైనప్ లో కొత్త ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ జెడ్‌ఎక్స్‌ను చేర్చింది. జెడ్‌ఎక్స్ గ్రేడ్‌తో పాటు, న్యూ జాజ్ ఇప్పుడు మాన్యువల్, సివిటి పెట్రోల్‌ వేరియంట్‌లలో వి, విఎక్స్, జెడ్‌ఎక్స్  ఉన్నాయి. రేడియంట్ రెడ్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, మోడరన్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ అనే 5 కలర్లలో  న్యూ జాజ్ అందుబాటులో ఉంటుంది.

also read ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు ...

కొత్త జాజ్ కోసం రూ.21,000 టోకెన్ మొత్తం చెల్లించి   బుక్‌ చేసుకోవచ్చు. కారు వెలుపల డిజైన్‌లో అనేక మార్పులు చేశారు.  జాజ్ ఇప్పుడు బీఎస్-6  ప్రమాణాలతో 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్‌తో ఆకట్టుకుంటున్నది.     2020లో ఆటోమేకర్  హోండా తీసుకొచ్చిన నాలుగో మోడల్‌ జాజ్‌.

లోపలి భాగంలో హోండా జాజ్ న్యూ క్రోమ్ అక్చువేటెడ్ హై గ్లోస్ బ్లాక్ గ్రిల్, డిఆర్ఎల్ న్యూ ఎల్ఇడి హెడ్ లాంప్ (ఇన్లైన్ షెల్) అడ్వాన్స్డ్ ఎల్ఇడి ప్యాకేజీ, న్యూ ఎల్ఇడి ఫాగ్ లాంప్స్, సిగ్నేచర్ రియర్ ఎల్ఇడి వింగ్ లైట్, కొత్తగా రూపొందించిన ఫ్రంట్, బ్యాంక్ బంపర్స్. న్యూ జాజ్  అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ కొత్తగా ప్రవేశపెట్టిన సెగ్మెంట్ ఎక్స్‌క్లూజివ్ ‘వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్’ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో కొత్త ధోరణిని నెలకొల్పుతుంది. కొత్త హోండా జాజ్ మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్, వోక్స్వ్యాగన్ పోలో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios