హోండా కార్స్ వాహనాల ఉత్పత్తి నిలిపివేత.. పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ స్కీమ్..
2020 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడా ప్లాంట్లో ఎలాంటి ఉత్పత్తి జరగలేదని ఒక నివేదికలో పేర్కొంది. గత నెల వరకు ఈ ప్లాంట్లో హోండా సిటీ సెడాన్, హోండా సిఆర్-వి ఎస్‌యూవీ, హోండా సివిక్ సెడాన్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా గ్రేటర్ నోయిడా ప్లాంట్లో వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తూన్నట్లు తెలిపింది, దాని మొత్తం ఉత్పత్తి యూనిట్‌ను రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని తపుకర ప్లాంట్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది.
2020 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడా ప్లాంట్లో ఎలాంటి ఉత్పత్తి జరగలేదని ఒక నివేదికలో పేర్కొంది. గత నెల వరకు ఈ ప్లాంట్లో హోండా సిటీ సెడాన్, హోండా సిఆర్-వి ఎస్‌యూవీ, హోండా సివిక్ సెడాన్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసింది. అయితే, ఈ విషయంపై ప్రస్తుతం స్పందించడానికి హోండా నిరాకరించింది.
గ్రేట్ నోయిడాలోని హోండా తయారీ విభాగంలో సుమారు 2 వేల మంది కార్మికులు ఉన్నారు, అయితే, ఇప్పుడు శాశ్వత ఉద్యోగుల సంఖ్య 1,000కి పడిపోయింది. వారిలో ఎక్కువ మంది స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) ఎంచుకున్నారని, మరికొందరిని తపుకర ప్లాంటుకు బదిలీ చేసినట్లు సమాచారం.
సంస్థ ఇప్పటికే ఇందులోని శాశ్వత ఉద్యోగుల కోసం వీఆర్‌ఎస్ ను తీసుకొచ్చింది, ఇది జనవరి 28, 2020 నుండి అమలులోకి వస్తుంది. సంస్థ కార్పొరేట్ కార్యాలయం, ఆర్ అండ్ డి విభాగం గ్రేట్ నోయిడా నుండి పనిచేయడం కొనసాగిస్తుందని తెలిపింది.
గ్రేటర్ నోయిడా ప్లాంట్ భారతదేశంలో జపనీస్ కార్ల తయారీదారుల మొదటి ఉత్పాదక కేంద్రం, ఇది 1997లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్లాంట్ ప్రారంభ సామర్థ్యం సంవత్సరానికి 30వేల యూనిట్లు, తరువాత దీనిని రెండు-షిఫ్ట్ ప్రాతిపదికన 50వేల కార్లకు పెంచారు.
2008 నాటికి, సంస్థ దాని ఉత్పాదక సామర్థ్యాన్ని ఏటా లక్ష యూనిట్లకు పెంచింది, ఇది ఇప్పటి వరకు మారలేదు. గ్రేటర్ నోయిడా సదుపాయంతో పోలిస్తే, తపుకర ప్లాంట్ వార్షిక సామర్థ్యం 180,000 యూనిట్లు.
2020లో సగటున హోండా కార్స్ ఇండియా నెలకు 10వేల కార్లను ఉత్పత్తి చేసింది, వీటిలో 50 శాతం గ్రేటర్ నోయిడా ప్లాంట్ నుండి వస్తున్నాయి. హోండా అమేజ్, హోండా సిటీ సెడాన్లు ప్రస్తుతం కంపెనీ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్, ఇవి నెలకు 4,000 నుండి 5,000 యూనిట్లు ఉత్పత్తి ఆవుతున్నయి.
హోండా డబ్ల్యుఆర్-వి నెలకు 1,000 యూనిట్లు, హోండా జాజ్, సివిక్, సిఆర్-వి మొత్తం నెలకు 800 యూనిట్లు ఉత్పత్తి ఆవుతున్నయి.