బీఎస్-6 ఇంజన్ తో హోండా సివిక్ డీజిల్ వేరియంట్ లాంచ్.. ధరెంతంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విపణిలోకి బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన సివిక్ డీజిల్ వేరియంట్ విడుదల చేసింది. ప్రీమియం సెడాన్ మోడల్ కారు ధర రూ.20.74 లక్షల నుంచి మొదలవుతుంది.
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా మరో నయా కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈసారి బీఎస్-6 ప్రమాణాలతో కూడి ‘సివిక్’ డీజిల్ వేరియంట్‌ను విడుదల చేసి డీజిల్ కార్లపై ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది.
ఈ ప్రీమియం సెడాన్ మోడల్ సివిక్ కారు ధర రూ.20.74 లక్షల నుంచి రూ.22.35 లక్షలకు లభ్యం అవుతుంది. ఇందులో పెట్రోల్ వేరియంట్ కారును 2019 మార్చిలో ప్రవేశపెట్టింది. ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో ఈ వెర్షన్‌ను ఎంచుకోవాలనుకునే వారికి కొత్త ఉద్గార నిబంధనలతో తీసుకొచ్చిన ఈ డీజిల్ ఇంజిన్ వాహనం మంచి ఆప్షన్ కాగలదు.
ఇది లీటరు డీజిల్‌కు 23.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా కార్స్ పేర్కొంది. వినియోగదరులు తమకు ఇష్టమైన సౌలభ్యం ఈ కారులో లభిస్తుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం డైరెక్టర్ రాజేశ్ గోయల్ తెలిపారు.
also read పడిపోయిన వాహనాల విక్రయాలు.. డీలర్ల ఫ్రాఫిట్స్ గోవిందా.. అయితే?! ...
డీజి్ సివిక్ కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లోనూ లభిస్తుంది. 1.6 లీటర్ ఐ-డీటీఈసీ టర్బో ఇంజిన్ గరిష్టంగా 118 హార్స్‌పవర్ వద్ద 4000 ఆర్పీఎం శక్తిని అందిస్తుంది. అలాగే, గరిష్ట టార్క్ 300 ఎన్ఎం కలిగి ఉంటుంది. వీఎక్స్ వేరియంట్ ధర రూ.20.74 లక్షలు కాగా, జెడ్ ఎక్స్ డీజిల్ వేరియంట్ ధర రూ. 22.34 లక్షలు.
ఆపిల్ కార్ ప్లలే, ఆండ్రాయిడ్ ఆటో కల 17.7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8 వే పవర్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.