వాహనదారులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. ఫాస్ట్‌టాగ్ గడువు పొడిగింపు..
ఫాస్ట్‌టాగ్‌ను ఉపయోగించి టోల్ ఛార్జీలు వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టిహెచ్) పొడిగించింది. ఈ గడువు మొదట 1 జనవరి 2021 వరకు విధించింది, కానీ ఇప్పుడు 15 ఫిబ్రవరి 2021 వరకు గడువు పొడిగించబడింది.
జాతీయ రహదారులపై ఫాస్ట్‌టాగ్‌ను ఉపయోగించి టోల్ ఛార్జీలు వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టిహెచ్) పొడిగించింది. ఈ గడువు మొదట 1 జనవరి 2021 వరకు విధించింది, కానీ ఇప్పుడు 15 ఫిబ్రవరి 2021 వరకు గడువు పొడిగించబడింది.
అసలు గడువు ప్రకారం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) జనవరి 1 నుండి అన్నీ టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ పేమెంట్ కి పూర్తిగా మారాలని నిర్ణయించింది. అంటే నాలుగు చక్రాల వాహనాలు, వాణిజ్య వాహనాలపై ఫాస్ట్‌టాగ్‌లను అమర్చడం తప్పనిసరి.
ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా లావాదేవీలు 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఫిబ్రవరి 15 నుంచి 100 శాతం నగదు రహిత టోల్ చార్జ్ వసూలు చేసేలా అవసరమైన అన్నీ నియంత్రణలను హైవేస్ అథారిటీ పొందగలదని ఎన్‌హెచ్‌ఏఐకి ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది.
also read సిటీ రైడ్స్ కోసం టయోటా అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్ పై 150 కి.మీ. నాన్ స్టాప్.. ...
ఇంకా ప్రభుత్వం రోడ్డు ఇరువైపుల ఒక లేన్ మినహా అన్ని లేన్లు ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. నాన్-ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ఉపయోగించే వాహనాలు నగదు లావాదేవీలను సాధారణ టోల్ ఫీజుకు కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది.
టోల్ చార్జెస్ కోసం డిజిటల్ పేమెంట్ ప్రోత్సహించడానికి, ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ తప్పనిసరి చేసింది. 1 డిసెంబర్ 2017 తర్వాత విక్రయించిన అన్ని కొత్త వాహనాలపై ఫాస్ట్‌యాగ్‌లు తప్పనిసరి చేసింది.
తాజాగా 2017 డిసెంబర్ 1 లోపు విక్రయించిన అన్నీ వాహనాలతో సహా మొత్తం నాలుగు చక్రాల వాహనాలకు ప్రభుత్వం ఇప్పుడు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి చేసింది.
సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు 1989 కూడా సవరించింది. థర్డ్ పార్టీ వాహన భీమా పొందేటప్పుడు ఫాస్ట్‌యాగ్‌లు తప్పనిసరి అని 1 ఏప్రిల్ 2021 నుండి ఇది వర్తిస్తుందని ఎంఓఆర్‌టిహెచ్ నోటిఫికేషన్ లో వెల్లడించింది.