ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సంచలనం.. బెంగళూరులో టెస్లా ఆర్‌అండ్‌డి సెంటర్ ఏర్పాటు..
టెస్లా కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ప్రసిద్ది. తాజాగా టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకుంది. ఇండియా మోటార్స్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదైంది.
బెంగళూరు / న్యూ ఢీల్లీ: యు.ఎస్ ఎలక్ట్రిక్ కార్లను తయారుచేసే సంస్థ టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్లా కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ప్రసిద్ది.
తాజాగా టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకుంది. ఇండియా మోటార్స్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదైంది. కంపెనీ కార్యాలయం బెంగళూరు క్లబ్ ముందు ఉన్న రిచ్‌మండ్ సర్కిల్ జంక్షన్ ఏర్పాటు కానుంది.
"మేము గత కొన్ని నెలలుగా టెస్లాతో సంభాషిస్తున్నాము, వారు తమ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు, ఇది ఒక సంతోషకరమైన వార్త. బెంగళూరు టెక్నాలజీ క్యాపిటల్ మాత్రమే కాదు ఏరోస్పేస్ ఇంకా స్పేస్ క్యాపిటల్ కూడా అని తెలిపాము.
ఏ విధమైన సాంకేతిక సహకారం కోసం ఇది సరైన టాలెంట్ పూల్ కలిగి ఉంది. వారు ఇండియాలోకి ఎలా ప్రవేశించాలనుకుంటున్నారు అలాగే దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది మిగిలి ఉంది "అని కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా అన్నారు.
also read అమ్మకానికి డొనాల్డ్ ట్రంప్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు.. వేలంలో పాల్గొనేందుకు మనోడు రెడీ.. ...
టెస్లా బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డి) కేంద్రాన్ని ప్రారంభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే చెప్పిందని, అయితే కంపెనీ ఒక తయారీ కర్మాగారంతో సహా ఇతర ప్రణాళికలకు స్థలం ఇచ్చిందని చెప్పారు.
కేంద్ర రహదారి రవాణా,రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ డిసెంబర్ చివరిలో మాట్లాడుతూ టెస్లా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, సేల్స్ తో పాటు ఆపై అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పాల్గొంటుందని చెప్పారు.
దీనిపై మరింత పూర్తి సమాచారం కోరుతూ చేసిన ఇమెయిల్‌కు టెస్లా స్పందించలేదు. బెంగళూరు ప్రధాన కార్యాలయ సంస్థ ఓలా 2400 కోట్ల వ్యయంతో తమిళనాడులో రెండు మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో తయారీలో దూసుకుపోయింది.
మహీంద్రా, హీరో, హ్యుందాయ్ వంటి ఇతర పెద్ద కంపెనీలు ఇంకా అథర్ వంటి స్టార్టప్‌లు దేశంలోని మొత్తం ఆటోమొబైల్ మార్కెట్లో 1% కన్నా తక్కువ వాటాతో భారతదేశం యొక్క నూతన ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో అధిక వాటాను స్వాధీనం చేసుకునే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి.
అమెజాన్ ఇంక్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ భారతదేశంలో కూడా ఒక సెలిబ్రిటీ హోదాను పొందుతున్నాడు, ఇది టెస్లాతో పాటు దాని ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తోడ్పడింది.
"టెస్లా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకాంక్షించే బ్రాండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇండియాలో టెస్లా అనుబంధ సంస్థ ఏర్పడటం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, నూతన ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు చాలా ముఖ్యమైనది "అని డేటా అనలిటిక్స్ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ డైరెక్టర్ పునీత్ గుప్తా అన్నారు.