సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లపై దీపావళి డిస్కౌంట్ ఆఫర్.. ప్యాకేజీలు, వారెంటీలు కూడా..

వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. 

Diwali 2020 offers : Luxury Ride Offers Festive Discounts On Pre-Owned Luxury Cars

మల్టీ బ్రాండెడ్, ప్రీ-ఔనుడ్ లగ్జరీ కార్ చైన్, లగ్జరీ రైడ్ ఈ నెలలో ప్రత్యేక ఫెస్టివల్ డీల్స్ ప్రకటించింది, వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది.

ఆఫర్‌లో ఉన్న ప్రత్యేక ప్రయోజనాల గురించి లగ్జరీ రైడ్‌లో ఎండి మరియు సహ వ్యవస్థాపకుడు సుమిత్ గార్గ్ మాట్లాడుతూ, "మా యాజమాన్యంలోని అన్ని లగ్జరీ కార్లపై మేము మంచి తగ్గింపులను అందిస్తున్నాము, కార్ల సర్వీసింగ్‌పై వివిధ స్కీంస్ కూడా అందిస్తున్నాము.  

అలాగే కార్లతో ఏ‌ఎం‌సి ప్యాకేజీలు, వారెంటీలను కాంప్లిమెంటరీ ప్యాకేజీగా ఇస్తున్నాము. అన్ని లగ్జరీ కార్ల అవసరాలకు ఇది ఒక వన్-స్టాప్ సోల్యూషన్. " అని అన్నారు.

also read బెంగుళూరు పోలీసులకు అపాచీ ఆర్టీఆర్ 160 బైకులను విరాళంగా ఇచ్చిన టీవీఎస్ సంస్థ ...

పండుగ సీజన్ అంచనాల గురించి సహ వ్యవస్థాపకుడు సుమిత్ గార్గ్ మాట్లాడుతు "ప్రీ-ఔనుడ్ లగ్జరీ కార్ల విభాగం వినియోగదారుల నుండి మంచి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ పండుగ సీజన్ లో మంచి అమ్మకాలని చూస్తామని మేము ఆశిస్తున్నాము. మా స్టాక్‌లో 10 శాతం ప్రీ-ఔనుడ్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉంటాయి. " అని అన్నారు.

లగ్జరీ రైడ్ ప్రీ-ఔనుడ్ లగ్జరీ కార్ల విభాగం భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుందని నమ్ముతుంది. దీనికి టైర్ II, IIIతో భారతదేశంలోని ఇతర నగరాల నుండి మంచి స్పందన లభిస్తుంది. క

స్టమర్ల డిమాండ్‌ను పరిష్కరించడానికి, కంపెనీ భారతదేశంలో నెట్‌వర్క్‌ పెంపుకు దూకుడుగా విస్తరిస్తోంది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 50కి పైగా షోరూమ్‌లను కలిగి ఉండాలని యోచిస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios