Asianet News TeluguAsianet News Telugu

బజాజ్‌లో కరోనా కలకలం: 200కి పైగా పాజిటివ్ కేసులు..

దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటోకు చెందిన ఔరంగాబాద్ (వలూజ్) ప్లాంట్‌లో కరోనా కలకలం చెలరేగింది. 200 మందికి పైగా కరోన సోకినట్లు తేలింది. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిని క్వారంటైన్ చేసి, సంస్థను శానిటైజ్ చేశారు. ఉత్పాదక కార్యకలాపాలు మాత్రం యధావిధిగా సాగుతున్నాయి.
 

covid 19: over 200 employees test positive at bajaj waluj plant
Author
Hyderabad, First Published Jun 27, 2020, 10:47 AM IST

ముంబై: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని వలూజ్ ప్లాంట్‌లో 200కి పైగా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని సంస్థ ప్రకటించింది.

అయితే కంపెనీ యూనిట్ మూసివేస్తారన్న అంచనాలను బజాజ్ ఆటోమొబైల్ తోసిపుచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులలో 2 శాతం మందే ప్రభావితమయ్యారని అవసరమైన భద్రతా చర్యలతో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.

జూన్ 6న మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని బజాజ్ ఆటోఅధికారికంగా ప్రకటించింది. 8100 మందికి పైగా ఉన్న ఉద్యోగులలో ఎక్కువమందికి పాజిటివ్ రావడంతో దేశీయ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఔరంగాబాద్‌లోని వలూజ్ కర్మాగారంలో కార్యకలాపాలను మూసివేసిందన్న నివేదికలను సంస్థ ఖండించింది. 

హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇతర అనారోగ్య కారణాలు కూడా తోడవ్వడంతో దురదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవి కైరాన్ రామసామి తెలిపారు. 


ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష, కాంటాక్ట్ ట్రేసింగ్, సెల్ఫ్ క్వారంటైన్, పూర్తి పారిశుద్ధ్యం  లాంటి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రవి కైరన్ రామసామి అన్నారు. బాధిత ఉద్యోగులకు వైద్య సహాయంతో సహా అన్ని సహకారాన్ని అందిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు.

also read మారుతీ ఉద్యోగులకు సోకిన కరోనా వైరస్..వారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.. ...

కాగా  బజాజ్ ఆటోకు చెందిన అతిపెద్ద తయారీ యూనిట్ వాలూజ్ ప్లాంట్‌లో ప్రధానంగా ఎగుమతి కోసం మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్నది. మరోవైపు మొదటి దశ  దేశ వ్యాప్త లాక్ డౌన్‌ను క్రూరమైన చర్యగా రాజీవ్ బజాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్ చివరి వారం నుంచి దశల వారీగా ఈ యూనిట్‌లో ఉత్పత్తి కార్యక్రమాలను పెంచారు. మూడు రోజుల క్రితం 165 మందికి వైరస్ సోకింని గుర్తించారు. ఇప్పుడు ఇది 200కు పైగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతం అంత పారిశ్రామిక వాడ కావడంతో త్వరలో మరో 100 కేసులు పెరుగుతాయని అంచనా. కొన్ని రోజుల క్రితమే పాజిటివ్ కేసులను గుర్తించినా ప్లాంట్‌లో పనులు యథాతథంగా సాగాయని ఓ వ్యక్తి తెలిపరు.

షాప్ ఫ్లోర్ లోని ఉద్యోగులు ఎప్పటి మాదిరిగానే విధులు నిర్వర్తించారని మరో వ్యక్తి చెప్పారు. రాత్రికి రాత్రే ప్రవర్తనలో మార్పు రాదని, అసెంబ్లీ యూనిట్లలో భౌతిక దూరం పాటించనే లేదని పేర్కొన్నారు. పాజిటివ్ అని తేలిన ఉద్యోగులను క్వారంటైన్ చేయకుంటే ఉద్యోగులు, ప్రొడక్షన్ షెడ్యూల్ మీద మరింత ప్రభావం పడేదని ఆ సంస్థ వర్గాలు చెప్పాయి.

ఈ నెల ఆరో తేదీన తొలి కేసు రికార్డైంది. నిబంధనల ప్రకారం టెస్టులు, కాంటాక్టుల గుర్తించి ఐసోలేషన్‌కు పంపారు. సంస్థను శానిటైజేషన్ చేశామని బజాజ్ ఆటో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సిబ్బందికి వేతనాల్లేని సెలవులు ఇవ్వడం మరో ఐచ్ఛికమని, అయితే ఉద్యోగులు, ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని రవి కైరాన్ రామసామి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios