Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: రోల్స్‌ రాయిస్‌లో 9,000..ఓలాలో 1400 మంది ఉద్యోగులకు రాంరాం..

కరోనా మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితులు మాటల్లో చెప్పనలవి కాదు.. ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. రోల్స్ రాయిస్ 9,000 మందికి, ఓలా క్యాబ్స్ 1400 మందికి ఉద్వాసన పలికాయి. ఇక షేర్ ఛాట్ అనే సంస్థ 101 మందిని సాగనంపింది. 
 

coorna effect: Rolls-Royce plans 9,000,  ola plan 1400 employee job  cuts
Author
Hyderabad, First Published May 21, 2020, 10:42 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయంలో ఒక వైపు మానవ హననం.. మరో వైపు ఆర్థిక సంక్షోభంతో కార్పొరేట్‌ దిగ్గజాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. ఈ  నేపథ్యంలోనే యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని రోల్స్ రాయిస్ తెలిపింది. తద్వారా 130 కోట్ల డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెట్ ఇంజిన్ తయారీదారు ప్రకటించింది. 

విమాన ఇంజిన్లను తయారు చేసే డెర్బీ ఆధారిత సంస్థ రోల్స్‌ రాయిస్‌.. కరోనా సంక్షోభంతో విలవిల్లాడుతోంది. దీంతో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 15 శాతం మందిని తగ్గించాలని  నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా తన సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. 

ఇది తయారీ సంక్షోభం కాకపోయినా, తాజా అనిశ్చితి, ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి వుందని రోల్స్ రాయిస్ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ అన్నారు. అయితే యూనియన్లతో చర్చలలతో ఉద్యోగ నష్టాలు ఎక్కడ ఉంటాయో కంపెనీ కచ్చితంగా తేల్చలేదు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం ప్రధానంగా బ్రిటన్‌లోనే ఉంటుందని భావిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా సేవలను నిలిపివేసిన వైమానిక పరిశ్రమ కోలుకోవడానికి "చాలా సంవత్సరాలు" పడుతుందని రోల్స్ రాయిస్ హెచ్చరించింది. మరోవైపు ఈ నిర్ణయంపై అక్కడి కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి. ఈ ఏడాది 400 విమానం ఇంజిన్లు నిర్మించాలని సిద్ధం చేసుకున్న ప్రణాళికను తాజా సంక్షోభంతో 250కి తగ్గించి వేసింది. 

also read ఇది హగ్ చేసుకోవాల్సిన టైం : ఆనంద్ మహీంద్రా ట్వీట్ ...

ఓలాలో 1400 మందికి ఉద్వాసన 
ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా కూడా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. గత రెండు నెలల్లో ఆదాయం 95% క్షీణించడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ నుండి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ ఈ సంగతి చెప్పారు. 

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా  భారతదేశం అంతటా మిలియన్ల మంది తమ డ్రైవర్లు, వారి కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేసిందని ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ చెప్పారు.  అసాధారణ, అనిశ్చిత పరిస్థితుల ప్రభావం తమపై దీర్ఘకాలంగా ఉండనుందని ప్రకటించారు. ఇప్పటికే ఉబెర్‌ కూడా ఉ‍ద్యోగుల  తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

షేర్‌చాట్‌లో 101 మంది ఇంటికి..
ప్రాంతీయ భాషల సోషల్ మీడియా దిగ్గజం షేర్ ఛాట్ 101 మందిని తొలగిస్తుననట్లు తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితుల వల్లే వారిని తొలగిస్తున్నట్లు తెలుపుతూ వారికి ఈ-మెయిల్ పంపింది. ఉద్యోగులకు రెండు నెలల పూర్తి వేతనం లేదా 4 నెలల పాటు 50 శాతం వేతనంపై కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చునని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు వారికి ఆరోగ్య బీమా వర్తిస్తుందని వెల్లడించింది. వ్యయ నియంత్రణ కోసం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios