వ్యాగన్‌ ‌ఆర్‌, బాలెనో కార్లలో లోపాలు.. 134,885 వాహనాలకు రీకాల్..

 1,34,885 యూనిట్ల వాగన్ఆర్, బాలెనో మోడళ్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 15, 2018 నుండి అక్టోబర్ 15, 2019 మధ్య తయారైన వాగన్ఆర్ (1 లీటర్), 2019 జనవరి 8 నుండి 2019 నవంబర్ 4 మధ్య తయారైన బాలెనో (పెట్రోల్) కార్లను కంపెనీ స్వచ్ఛందంగా రీకాల్ చేస్తోందని ఎంఎస్ఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

cars manufacturer maruti suzuki to recall 134885 units of wagonr, baleno cars

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) బుధవారం 1,34,885 యూనిట్ల వాగన్ఆర్, బాలెనో మోడళ్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.

నవంబర్ 15, 2018 నుండి అక్టోబర్ 15, 2019 మధ్య తయారైన వాగన్ఆర్ (1 లీటర్), 2019 జనవరి 8 నుండి 2019 నవంబర్ 4 మధ్య తయారైన బాలెనో (పెట్రోల్) కార్లను కంపెనీ స్వచ్ఛందంగా రీకాల్ చేస్తోందని ఎంఎస్ఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు  రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్ల 1,34,885 కార్లకు రీకాల్ కవర్ చేస్తుంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు.

also read కరోనా కంటే ముందే ఆ సమస్యల్లో ఆటోమొబైల్ రంగం: సియామ్ ...

మోటారు జనరేటర్ యూనిట్‌లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్‌ కార్లను  స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. "ఇంధన పంపు సమస్య కారణంగా కంపెనీ 56,663 యూనిట్ల వాగన్ఆర్, 78,222 యూనిట్ల బాలెనోను తనిఖీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

లోపం కలిగిన వాహనంలో వాటిని ఉచితంగా రిప్లేస్ చేయబడుతుంది" అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రీకాల్ క్యాంపెయిన్ కింద వాహనాల యజమానులను నిర్ణీత సమయంలో మారుతి సుజుకి అధీకృత డీలర్లు సంప్రదిస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios